Snowfall | హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh)లో మంచు వర్షం (Snowfall) కనువిందు చేస్తోంది. దేశరాజధాని సిమ్లాలో ఎటుచూసినా మంచు దుప్పటి పరుచుకుని ఆహ్లాదంగా కనిపిస్తోంది. అడుగుల మేర పేరుకుపోయి శ్వేతవర్ణంతో పర్యాటకులను (Tourists) ఆహ్వానిస్తోంది. పర్యాటకులు ఈ శీతల వాతావరణాన్ని ఆస్వాదిస్తూ మంచులో ఆటలాడుతూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు.
#WATCH | Manali, Himachal Pradesh: Tourists enjoy snowfall at the Mall Road. pic.twitter.com/hEbyZaIO4g
— ANI (@ANI) January 31, 2024
సిమ్లా (Shimla)లోని కుఫ్రి, ఖరపత్తర్, మనాలీ (Manali) సహా పలు ప్రాంతాలు కనుచూపు మేర శ్వేత వర్ణాన్ని సంతరించుకున్నాయి. రహదారులు, ఇళ్లు, భవనాలపై దట్టంగా మంచు పేరుకుపోయింది. సందర్శకులు మంచు వర్షాన్ని ఆస్వాదిస్తున్నారు. మంచులో తడుస్తూ ఆటలు ఆడుతూ సందడి చేస్తున్నారు. మరోవైపు రహదారులపై పేరుకుపోతున్న మంచును ఎప్పటికప్పుడు తొలగించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.
#WATCH | Himachal Pradesh | Kufri in Shimla receives fresh snowfall pic.twitter.com/N4c9EdBu1x
— ANI (@ANI) January 31, 2024
#WATCH | Himachal Pradesh | Kharapathar area in Shimla gets covered in a blanket of snow as it receives fresh snowfall. pic.twitter.com/OkC7HBstlB
— ANI (@ANI) January 31, 2024
Also Read..
PayPal | ఉద్యోగులకు షాక్ ఇచ్చిన పేపాల్.. ప్రపంచవ్యాప్తంగా 2,500 మందిపై వేటు