Arvind Kejriwal | ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) న్యూ ఢిల్లీ (New Delhi) స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. తనకు సొంతంగా ఇల్లు, కారు లేదని కేజ్రీ ప్రకటించారు. తాను 14 క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్నట్లు వెల్లడించారు.
తనకు మొత్తం రూ.1.73 కోట్ల ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్లో (Poll Affidavit) కేజ్రీవాల్ పేర్కొన్నారు. ప్రస్తుతం తన చేతిలో రూ.40,000 నగదు, తన భార్య సునీత కేజ్రీవాల్ చేతిలో రూ.32,000 నగదు ఉన్నట్లు తెలిపారు. అదేవిధంగా తన భార్య సునీత మొత్తం ఆస్తుల విలువ రూ.2.5 కోట్లుగా పేర్కొన్నారు. అందులో రూ.25 లక్షల విలువైన 320 గ్రాముల బంగారంతోపాటు రూ.92 వేల విలువైన కేజీ వెంటి ఉన్నట్లు వెల్లడించారు. ఇక సునీతకు గురుగ్రామ్‌లో ఇల్లు, ఒక మారుతి సుజుకి బెలెనో (2017 మోడల్) కారు ఉన్నట్లు తెలిపారు. దంపతులిద్దరి ఆస్తుల విలవ రూ.4.23 కోట్లుగా ప్రకటించారు.
Also Read..
Karnataka | సిద్ధరామయ్య స్థానంలో డీకే.. నవంబర్‌లో కర్ణాటక సీఎం మార్పు?
WEF | దేశాల మధ్య సాయుధ ఘర్షణలే.. ప్రపంచానికి తక్షణ ముప్పు: డబ్ల్యూఈఎఫ్
High Court | యజమాని కోరితే అద్దెకున్నవారు ఖాళీ చేయాల్సిందే: హైకోర్టు