High Court | అలహాబాద్: భవనంలో కిరాయికి తీసుకున్న గదులను ఆ భవన యజమాని తన వ్యక్తిగత అవసరం కోసం కోరితే ఖాళీ చేయాల్సిందేనని అలహాబాద్ హైకోర్టు తీర్పు చెప్పింది. అద్దెకు ఉన్నవారికి వ్యతిరేకంగా రూలింగ్ ఇవ్వడానికి ముందు, ఆ యజమాని అవసరం సరైనదేనా? అనే అంశాన్ని కోర్టులు పరిశీలించాలని తెలిపింది. యజమాని ఇష్టం మేరకు మాత్రమే అద్దెకున్నవారు ఉండాలని చెప్పింది.
అద్దెకున్నవారు దాఖలుచేసిన పిటిషన్ను తోసిపుచ్చింది. ఈ కేసులో భవన యజమానికి వేరొక చోట బైక్ మరమ్మతు చేసే దుకాణం ఉంది. దానిని ఖాళీ చేయాలని ఆ భవన యజమాని కోరడంతో, తన సొంత భవనంలోని రెండు దుకాణాలను ఖాళీ చేయాలని కోరారు. అందుకు కిరాయికి ఉన్నవారు తిరస్కరించారు. దీంతో ఆయన అధికారులను ఆశ్రయించగా ఆ దుకాణాలను ఖాళీ చేయాలని ఆదేశించారు. దీనిపై అద్దెకున్నవారి అప్పీలు తిరస్కరణకు గురైంది. దీంతో వారు హైకోర్టును ఆశ్రయించారు.