Arvind Kejriwal | దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయాలు వేడెక్కాయి. మరో నెల రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండటంతో.. అధికార, విపక్ష పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో ఢిల్లీ మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) రెండు స్థానాల నుంచి పోటీ చేస్తున్నారంటూ బీజేపీ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. న్యూ ఢిల్లీతోపాటు మరో స్థానం నుంచి కేజ్రీ పోటీ చేయబోతున్నారంటూ బీజేపీ నేతలు పేర్కొంటున్నారు. ఈ ఆరోపణలపై కేజ్రీవాల్ తాజాగా స్పందించారు. బీజేపీ నేతల ఆరోపణలను ఖండించారు. తాను కేవలం ఒక్క స్థానం నుంచే పోటీ చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
కాగా, న్యూ ఢిల్లీ స్థానం నుంచి కేజ్రీ వరుసగా నాలుగోసారి పోటీకి సిద్ధమయ్యారు. ఈ స్థానం నుంచి కేజ్రీవాల్‌పై బీజేపీ తరఫున మాజీ ఎంపీ పర్వేశ్ వర్మ (Parvesh Verma), కాంగ్రెస్ అభ్యర్థి సందీప్ దీక్షిత్ పోటీ చేస్తున్నారు. మరోవైపు 2015, 2020 అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు 67, 62 స్థానాలతో ఆప్ క్లీన్ స్వీప్ చేసింది. హ్యాట్రిక్ విక్టరీతో మూడోసారి అధికారంలోకి రావాలని ఆ పార్టీ భావిస్తున్నది. 70 మంది సభ్యులున్న ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 5న పోలింగ్ జరుగనున్నది. ఫిబ్రవరి 8న ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు.
Also Read..
Trinamool supports AAP | ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో.. ఆప్‌కు టీఎంసీ మద్దతు
Arvind Kejriwal | బీజేపీ, కాంగ్రెస్ మధ్య చీకటి సహకారం.. అశోక్ గెహ్లాట్‌పై కేజ్రీవాల్ ఫైర్
INDIA Alliance | కేజ్రీవాల్ వెంట ఇండియా కూటమి.. ఢిల్లీ ఎన్నికల్లో ఒంటరైన కాంగ్రెస్