Liquor Policy | సీబీఐ కేసులో సీఎం కేజ్రీవాల్ పిటిషన్‌ను కొట్టివేసిన ఢిల్లీ హైకోర్టు.. బెయిల్ పిటిషన్ తిరస్కరణ..!
Liquor Policy | మద్యం పాలసీ కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు సోమవారం కొట్టివేసింది. అలాగే, బెయిల్ పిటిషన్‌ను సైతం కోర్టు తిరస్కరించింది.
Liquor Policy | మద్యం పాలసీ కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు సోమవారం కొట్టివేసింది. అలాగే, బెయిల్ పిటిషన్‌ను సైతం కోర్టు తిరస్కరించింది. ఎలాంటి కారణం లేకుండా అరెస్టు చేశారని, చట్టవిరుద్ధమని చెప్పలేమని కోర్టు పేర్కొంది. కేజ్రీవాల్ తరఫున సీనియర్ నాయయవాదులు అభిషేక్ మను సింఘ్వీ, ఎన్ హరిహరన్, రమేశ్ గుప్తా వాదనలు వినిపించారు. సీబీఐ కేసులో కేజ్రీవాల్ అరెస్టు చేయడం ‘ఇన్సురెన్స్ అరెస్ట్’ అని సింఘ్వీ వాదించారు. మద్యం పాలసీపై కేజ్రీవాల్‌తో పాటు అప్పటి ఎల్జీ అనిల్ బైజాల్ సైతం సంతకం చేశారని.. ఆ లాజిక్ ప్రకారం.. ఇందులో పాల్గొన్న మాజీ ఎల్జీ, బ్యూరోక్రాట్స్‌ని సైతం నిందితులుగా చేయాలన్నారు.
ఊహలు, కల్పనలతో పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. మనీలాండరింగ్ కేసులో సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చినప్పటికీ ‘ఇన్సురెన్స్ అరెస్ట్’ కారణంగా మళ్లీ మొదటి దశకు వచ్చారన్నారు. కుంభకోణంలో సూత్రధారి కేజ్రీవాల్ అని చెప్పేందుకు, ఆయన ప్రమేయంపై ప్రత్యక్ష సాక్ష్యాలు సీబీఐ ఎస్ఎస్పీ తెలిపారు. అరెస్టు చట్టవిరుద్ధం కాదని ట్రయల్ కోర్టు ఇప్పటికే నిర్ధారణకు వచ్చిందని తెలిపారు. కేజ్రీవాల్‌పై సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేసినంత మాత్రాన ముఖ్యమంత్రి బెయిల్‌పై విడుదలయ్యే అర్హత లేదని ఎస్ఎస్పీ సింగ్ పేర్కొన్నారు. ‘ఇన్సురెన్స్ అరెస్ట్’ అనే పదాన్ని ఉపయోగించడం సమర్థనీయం కాదని పేర్కొన్నారు.
కేజ్రీవాల్‌కు సీబీఐ ముందస్తు నోటీసు ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఈడీ కేజ్రీవాల్‌కు ఇటీవల బెయిల్‌ను మంజూరు చేసిన విషయం తెలిసిందే. అంతకు ముందు జైలులో ఉన్న ఆయనను సీబీఐ అదుపులోకి తీసుకొని విచారించడంతో అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుచగా జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. సీబీఐ జూన్ 26న అరెస్టు చేసింది. మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మేలో సాధారణ ఎన్నికల నేపథ్యంలో జూన్ ఒకటో తేదీ వరకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్‌ను జారీ చేసిన విషయం తెలిసిందే. జూన్ 2న మళ్లీ జైలులో లొంగిపోయారు. మరో వైపు హైకోర్టు నిర్ణయం నేపథ్యంలో కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు సమాచారం.
Read Also :
-
Bengal Minister Resigns | ‘ఏ అధికారికి క్షమాపణ చెప్పను’.. బెంగాల్ మంత్రి రాజీనామా
-
Asha Kiran row | ఆశా కిరణ్‌లో పిల్లల మరణాలపై హైకోర్టు ఆందోళన.. నీటి నాణ్యత పరీక్షకు ఆదేశం
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

