కోల్‌కతా: ఏ అధికారికి తాను క్షమాపణ చెప్పబోనని పశ్చిమ బెంగాల్ మంత్రి అఖిల్ గిరి తెలిపారు. సోమవారం తన మంత్రి పదవికి ఆయన రాజీనామా చేశారు. (Bengal Minister Resigns) సీఎం మమతా బెనర్జీ కార్యాలయానికి రాజీనామా లేఖను పంపినట్లు చెప్పారు. ‘ నేను ప్రధాన కార్యదర్శి ద్వారా ముఖ్యమంత్రి కార్యాలయానికి నా రాజీనామా సమర్పించా. కానీ నేను ఏ అధికారికి క్షమాపణ చెప్పను. అవసరమైతే ముఖ్యమంత్రికి క్షమాపణ చెబుతా’ అని మీడియాతో అన్నారు. ఆ రోజు ప్రజల కష్టాలు చూసి, అటవీ శాఖ వారు చిరు వ్యాపారులను ఎలా హింసిస్తున్నారో చూసి తాను సహించలేకపోయానని కరెక్షనల్ సర్వీసెస్ మంత్రి అయిన అఖిల్ గిరి తెలిపారు. తాను మాట్లాడినందుకు కాదని, ఒక ప్రత్యేకమైన పదం వాడినందుకు క్షమించాలని కోరారు. తాను ఏమి చేసినా ప్రజల కోసమే అని అన్నారు. రామ్‌నగర్ టీఎంసీ ఎమ్మెల్యేగా ప్రజలకు సేవలందిస్తానని తెలిపారు.
కాగా, పూర్బా మేదినీపూర్ జిల్లా తాజ్‌పూర్‌లోని సముద్ర తీరంలో అటవీ శాఖ భూమిలో కొన్ని షాపులను అక్రమంగా ఏర్పాటు చేశారు. సముద్రానికి చాలా దగ్గరగా, ప్రమాదకర స్థితిలో ఉన్న అక్రమ షాపులను అటవీ శాఖ సిబ్బంది శుక్రవారం రాత్రి తొలగించారు. చిరు వ్యాపారుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న అఖిల్ గిరి శనివారం సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్రమ షాపులను తొలగించడంపై మహిళా ఫారెస్ట్ రేంజర్ మనీషా సాహుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరోవైపు మిగతా అక్రమ నిర్మాణాలను వదిలేసి పేదలకు చెందిన షాపులను మాత్రమే తొలగించారని అఖిల్ గిరి ఆరోపించారు. ఈ సందర్భంగా మహిళా అధికారిణిని దుర్భాషలాడటంతోపాటు ఆమె సర్వీస్‌ను తగ్గిస్తానని బెదిరించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఆయనపై చర్యలు తీసుకోవాలని బెంగాల్ బీజేపీ డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో మంత్రి వర్గం నుంచి వైదొలగాలని తృణమూల్ కాంగ్రెస్ నాయకత్వం ఆయనను ఆదేశించింది. దీంతో సోమవారం మంత్రి పదవికి ఆయన రాజీనామా చేశారు.
#WATCH | Kolkata: On his disrespectful comments on female Forest Officer, West Bengal minister and TMC leader Akhil Giri says, “I will not say anything. The party ordered me to resign from the cabinet, and I have tendered my resignation. I handed it over to the Chief Minister. I… pic.twitter.com/vFica0RH2P
— ANI (@ANI) August 5, 2024
West Bengal Minister Akhil Giri threatens a lady Forest Officer because she was performing her duty to remove illegal encroachment in forest areas.
What did he say –
1. "সরকারি কর্মচারী, মাথা নিচু করে কথা বলবেন।" – You are a government employee, bow down your head (infront of… pic.twitter.com/CDrULP9Mli
— BJP West Bengal (@BJP4Bengal) August 3, 2024