లక్నో: ఢిల్లీలో వస్త్ర వ్యాపారం చేస్తున్న కమల్ సోమాని, ఆశిష్ ఖురానా తలచినది ఒకటి, జరిగినది వేరొకటి. కమల్‌కు రూ.50 లక్షల అప్పు ఉంది. దీన్ని తీర్చడానికి ఆయన ఓ పథకం రచించాడు. తన దుకాణంలో గతంలో పని చేసిన అన్షుల్ పేరు మీద రూ.50 లక్షలకు బీమా పాలసీ తీసుకున్నాడు.
అన్షుల్ డమ్మీ (పాస్టిక్ బొమ్మ)కి అంత్యక్రియలు చేసి, ఫేక్ డెత్ సర్టిఫికెట్తో బీమా సొమ్మును పొందాలని భావించాడు. ఈ క్రమంలో యూపీలోని హాపూర్, బ్రజ్‌ఘాట్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు చేయడానికి ప్రయత్నించగా, అక్కడి ఉద్యోగికి అనుమానం రావడంతో వీరి గుట్టు రట్టయింది.