KTR | కాంగ్రెస్ కబంద హస్తాల్లో మనుషులే కాదు.. చెట్లు బతకడం లేదు.. కేటీఆర్ ఆవేదన
KTR | కాంగ్రెస్ కబంద హస్తాల్లో చిక్కుకుని రెండేళ్లుగా విలవిలలాడుతున్న తెలంగాణలో మనషులనే కాదు.. చివరికి పచ్చని చెట్లను కూడా బతకనివ్వడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
KTR | కాంగ్రెస్ కబంద హస్తాల్లో చిక్కుకుని రెండేళ్లుగా విలవిలలాడుతున్న తెలంగాణలో మనషులనే కాదు.. చివరికి పచ్చని చెట్లను కూడా బతకనివ్వడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ప్రతి పల్లెలో పచ్చదనం ఉండాలనే మహోన్నత లక్ష్యంతో కేసీఆర్ నిర్మించిన పల్లె ప్రకృతి వనాలపై కూడా పగబట్టడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు.
మహబూబ్ నగర్‌లోని దేవరకద్ర మండలం జీనుగురాలలో పల్లె ప్రకృతి వనంలోని 200 చెట్లను కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులే నిర్దాక్షిణ్యంగా నరికివేయడం దారుణమని కేటీఆర్ విమర్శించారు. పదేళ్లపాటు ఆహ్లాద వాతావరణంలో కళకళలాడిన పల్లెలను అన్నిరకాలుగా ధ్వంసం చేస్తున్న కాంగ్రెస్ నిజస్వరూపం రోజుకో రూపంలో బయటపడుతోందని తెలిపారు. ఇప్పటికే చెక్ డ్యామ్‌లను పేల్చివేస్తున్నారని.. చెరువులను చెరబట్టారని.. వ్యవసాయాన్ని కుప్పకూల్చారని.. కులవృత్తులను కాలరాశారని పేర్కొన్నారు. ఇప్పుడు నీడనిచ్చే చెట్లను కూడా అడ్డంగా నరికేస్తున్నారని మండిపడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే ఈ దుశ్చర్యకు పాల్పడిన ప్రతి ఒక్కరిపై కేసు నమోదుచేసి కఠినంగా శిక్షించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. “పల్లె కన్నీరు పెడుతుందో” అని మరోసారి పాడుకునే దుస్థితి తెచ్చిన కాంగ్రెస్ పార్టీపై తెలంగాణలోని ప్రతి గ్రామం తిరగబడే రోజు దగ్గర్లోనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ కబంద హస్తాల్లో చిక్కుకుని రెండేళ్లుగా విలవిలలాడుతున్న తెలంగాణలో మనషులనే కాదు.. చివరికి పచ్చని చెట్లను కూడా బతకనివ్వడం లేదు.
ప్రతి పల్లెలో పచ్చదనం ఉండాలనే మహోన్నత లక్ష్యంతో కేసీఆర్ గారు నిర్మించిన పల్లె ప్రకృతి వనాలపై కూడా పగబట్టడం దుర్మార్గమైన చర్య.
మహబూబ్ నగర్ లోని… pic.twitter.com/5v5PhXAeq9
— KTR (@KTRBRS) February 25, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- BRS
- Congress
- KTR
- Palle pragathi
RELATED ARTICLES
తాజా వార్తలు
Nagarjuna Sagar | నాగార్జునసాగర్ డ్యాం ఎడమ కాలువకు నీటి విడుదల చేసిన ఎన్ఎస్పీ అధికారులు
Varanasi | ‘వారణాసి’లో రామాయణ ఘట్టమే హైలైట్.. రాజమౌళి స్వయంగా తీసుకున్న సవాల్ ఇదే!
Ponnam Prabhakar | ఆర్టీసీ–మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గుతాయా? కీలక విషయాలను వెల్లడించిన పొన్నం ప్రభాకర్
Karepalli | అధిక లోడుతో సుబాబుల్ లారీలు.. గ్రామాల మీదుగా యథేచ్ఛగా రవాణా!
Naresh | పెళ్లి చేసుకున్నా, చేసుకోకపోయినా పర్వాలేదు.. పిల్లల్ని మాత్రం కనండి: నటుడు నరేశ్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

