మల్లాపూర్ : జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రం శివారులో ఓ స్కూల్ వాహనం బోల్తాపడింది. ఈ ప్రమాదంలో నలుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. బోల్తాపడిన వాహనం మండల కేంద్రంలోని వికాస్ మోడల్ స్కూల్కు చెందినదని స్థానికులు తెలిపారు.
వికాస్ మోడల్ స్కూల్కు చెందిన టాటా ఏసీ వాహనం ఇవాళ ఉదయం విద్యార్థులను పాఠశాలకు తీసుకువస్తుండగా అదుపుతప్పి బోల్తా పడింది. రోడ్డుపక్కనున్న పంటపొలాల్లో దూసుకెళ్లి పడిపోవడంతో అందులో ఉన్న నలుగురు విద్యార్థులు గాయపడ్డారు.