Ram Mandir | భక్తజనసందోహంగా అయోధ్యాపురి.. బాలరాముడిని దర్శించుకున్న 3 లక్షల మంది భక్తులు
Ram Mandir | శ్రీరామ జన్మభూమి (Shri Ram Janmabhoomi) అయోధ్యాపురి భక్తజనసందోహంగా మారింది. మొదటి రోజు కావడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం నుంచి ఇప్పటి వరకూ 2.5 లక్షల నుంచి 3 లక్షల మంది భక్తులు రామ్ లల్లాను దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు.
Ram Mandir | శ్రీరామ జన్మభూమి (Shri Ram Janmabhoomi) అయోధ్యాపురి భక్తజనసందోహంగా మారింది. వంద ఏళ్లుగా ఎదురుచూస్తున్న కోట్లాది మంది భారతీయుల కల సాకారమవుతూ.. అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామ మందిరంలో బాలరాముడి రూపంలో శ్రీరాముడు కొలువుదీరిన విషయం తెలిసిందే. దీంతో నేటి నుంచి శ్రీరాముడి దర్శనానికి సాధారణ భక్తులకు అనుమతిస్తున్నారు. ఈ నేపథ్యంలో భవ్యమైన రామ మందిరం (Ram Mandir)లో దివ్యమైన అవతారంలో కొలువుదీరిన శ్రీరాముడిని చూసేందుకు భక్తులు రామాలయానికి పోటెత్తారు.
భక్తులు తెల్లవారుజామున 3 గంటలకే మందిరం వద్దకు చేరుకోగా.. ఉదయం 7 గంటల నుంచి ఆలయంలోకి అనుమతిస్తున్నారు. ఇక మొదటి రోజు కావడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం నుంచి ఇప్పటి వరకూ 2.5 లక్షల నుంచి 3 లక్షల మంది భక్తులు రామ్ లల్లాను దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు. మరో 3 లక్షల మంది దర్శనం కోసం వేచిఉన్నట్లు చెప్పారు. భక్తులకు నిరంతరం రాములోరి దర్శన భాగ్యం కల్పించేందుకు స్థానిక యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోందని పేర్కొన్నారు.
మరోవైపు బాలరాముడి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయ ప్రాంగణమంతా కిక్కిరిపోయింది. ఈ క్రమంలో అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొంది. రద్దీని అదుపుచేసందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. రద్దీ నేపథ్యంలో రాములోరి దర్శనానికి సమయం పడుతుండటంతో భక్తులు సహనం కోల్పోతున్నారు. ఈ క్రమంలో అక్కడ విధుల్లో ఉన్న సెక్యూరిటీ (security) సిబ్బందిని తోసుకుంటూ ఆలయంలోకి దూసుకెళ్తున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. అయితే, ప్రస్తుతం అక్కడ పరిస్థితి అదుపులోనే ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
#WATCH | Around 2.5 lakh to 3 lakh devotees have taken the darshan of Ram Lalla in Ayodhya today. A similar number of devotees are awaiting darshan, and the local administration is making all the arrangements to provide continuous darshan to the devotees. The situation is under… pic.twitter.com/j6nyHvca9S
— ANI (@ANI) January 23, 2024
Also Read..
Ayodhya | దేశంలోనే అతిపెద్ద పర్యాటక ప్రాంతంగా అయోధ్య..! కీలక నివేదిక వెల్లడించిన జెఫరీస్..!
Himanta Sarma | రాహుల్ గాంధీపై కేసు నమోదు చేయండి.. అస్సాం సీఎం ఆదేశాలు
Ram Temple | రామమందిరం వద్ద గందరగోళ పరిస్థితి.. సెక్యూరిటీని తోసుకుంటూ వెళ్లిన భక్తులు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

