Kalpana Soren : గందే అసెంబ్లీ ఉప ఎన్నికల్లో జేఎంఎం అభ్యర్ధిగా బరిలో దిగిన జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సొరేన్ భార్య కల్పనా సొరేన్ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. జార్ఖండ్ గురించి మాట్లాడే ముందు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
హేమంత్ సొరేన్ సీఎంగా తన పదవీకాలాన్ని పూర్తి చేయలేదని, ఐదేండ్ల పదవీకాలం పూర్తిచేస్తే ఆయనను రాబోయే పాతికేండ్ల వరకూ ఎవరూ టచ్ చేయలేరనే విషయం బీజేపీకి తెలుసని ఆమె పేర్కొన్నారు.
హేమంత్ సొరేన్‌ను కుట్రపూరితంగా కాషాయ పాలకులు అరెస్ట్ చేశారని కల్పనా సొరేన్ ఆరోపించారు. జార్ఖండ్ ప్రజలు బీజేపీకి లోక్‌సభ ఎన్నికల్లో గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు. విపక్ష ఇండియా కూటమి ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
Read More :