KKR vs DC : స్వల్ప ఛేదనలో కోల్కతా ఓపెనర్ ఫిలిప్ సాల్ట్(60) అర్ధ శతకం బాదేశాడు. ఎడాపెడా బౌండరీలు బాదుతున్న సాల్ట్ కోల్కతా స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్నాడు. దాంతో, ఆరు ఓవర్లకే కోల్కతా వికెట్ కోల్పోకుండా 79 రన్స్ కొట్టింది. మరో ఓపెనర్ సునీల్ నరైన్ 15 పరుగులతో ఆడుతున్నాడు. కోల్కతా విజయానికి ఇంకా 84 బంతుల్లో 75 రన్స్ కావాలంతే.
ఈ సీజన్లో రెచ్చిపోతున్న సాల్ట్.. విలియమ్స్ వేసిన తొలి ఓవర్లో 23 పరుగులు పిండుకున్నాడు. ఆ తర్వాత ఖలీల్ అహ్మద్ ఓవర్లో లైఫ్ లభించడంత బతికిపోయిన సాల్ట్ ఆ తర్వాత బౌండరీ మోత మోగించాడు. దాంతో, నరైన్ నాన్ స్ట్రయింకింగ్కే పరిమితమయ్యాడు.