గద్వాల, అక్టోబర్ 3: జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలం ఓబులోనిపల్లి గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన జమ్ములమ్మ అనే మహిళను ఆమె భర్త గోపి రోకలి బండతో కొట్టి హత్య చేసినట్లు సమాచారం.
మహిళ మృతిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. హత్య కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. భార్యాభర్తల మధ్య జరిగిన వివాదమే ఘటనకు కారణమా? ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది. జమ్ములమ్మ మృతికి గల పూర్తి కారణాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.