Guwahati : అస్సాం (Assam) రాజధాని గుహవాటి (Guwahati) లో దారుణం జరిగింది. ఓ యువతిపట్ల నైట్‌క్లబ్ (Nightclub) బౌన్సర్లు దారుణంగా వ్యవహరించారు. ఆమె దుస్తులు ఊడదీసి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా (Social Media) లో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. గువాహటిలోని ఖానాపారా (Khanapara) ప్రాంతంలో ఉన్న నైట్‌క్లబ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. యువతిపై దాడికి పాల్పడిన వారిలో మహిళా, పురుష బౌన్సర్లు ఉన్నారు.
ఆమెను వివస్త్రను చేసి కింద పడేసి తీవ్రంగా కొట్టారు. ఇతరులు అడ్డుకోవడానికి ప్రయత్నించినప్పటికీ ఆ బౌన్సర్లు దాడిని అనంతరం బాధితురాలిని క్లబ్ నాలుగో అంతస్తు నుంచి పార్కింగ్ ప్రాంతానికి తీసుకెళ్లిన దృశ్యాలు వీడియలో ఉన్నాయి. అయితే ఈ ఘర్షణకు గల కారణాలు, బాధితురాలి వివరాలు తెలియరాలేదు. ప్రస్తుతం ఆ నైట్‌క్లబ్‌ను మూసి ఉంచినట్లు మీడియా కథనాలు వెలువడ్డాయి. కాగా ఈ ఘటనపై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నారు.