Himanta Sarma | రాహుల్ గాంధీపై కేసు నమోదు చేయండి.. అస్సాం సీఎం ఆదేశాలు
Himanta Sarma | కాంగ్రెస్ అగ్రనేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ ( Rahul Gandhi)పై అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ (Himanta Sarma) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు రాహుల్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయాలంటూ రాష్ట్ర పోలీసులను ఆదేశించారు.
Himanta Sarma | కాంగ్రెస్ అగ్రనేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ ( Rahul Gandhi)పై అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ (Himanta Sarma) ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్ జోడో న్యాయ్ యాత్ర (Bharat Jodo Nyay Yatra) పేరుతో రాహుల్ రాష్ట్రంలో అశాంతిని సృష్టించారని మండిపడ్డారు. ఈ మేరకు రాహుల్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయాలంటూ రాష్ట్ర పోలీసులను ఆదేశించారు.
ఇంతకీ ఏం జరిగిందంటే..
రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర ప్రస్తుతం అస్సాం రాష్ట్రంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. మణిపూర్‌లో మొదలైన ఈ యాత్ర రెండు రోజుల క్రితం అస్సాంకు చేరుకుంది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం అడుగడుగునా రాహుల్ జోడో యాత్రకు ఆటంకాలు సృష్టిస్తున్నది. సోమవారం అస్సాంలోని ఓ ఆలయంలోకి వెళ్లకుండా అక్కడి అధికారులు రాహుల్‌ను అడ్డుకున్నారు. ఆ తర్వాత మోరెగావ్ జిల్లాలో పాదయాత్రకు, స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌కు అనుమతి నిరాకరించారు. అయినా రాహుల్‌గాంధీ ఇవాళ మోరెగావ్‌లో పాదయాత్రకు వెళ్లడంతో పోలీసులు అడ్డుకున్నారు.
ఈ క్రమంలో పోలీసులు, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడ ఉన్న బారికేడ్లను తొలగించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనపై రాష్ట్ర సీఎం హిమంత ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించినందుకు గానూ రాహుల్‌పై కేసు నమోదు చేయాలని రాష్ట్ర పోలీసులను సీఎం హిమంత ఆదేశించారు.
Also Read..
Elon Musk | భద్రతా మండలిలో మార్పులు అవసరం.. భారత్‌కు శాశ్వత సభ్యత్వం లేకపోవడంపై మస్క్ స్పందన
Ram Temple | రామమందిరం వద్ద గందరగోళ పరిస్థితి.. సెక్యూరిటీని తోసుకుంటూ వెళ్లిన భక్తులు
Zomato | ప్రాణ ప్రతిష్ట వేళ.. నాన్‌వెజ్‌ను నిషేధించిన జొమాటో
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

