Zomato | ప్రాణ ప్రతిష్ట వేళ.. నాన్‌వెజ్‌ను నిషేధించిన జొమాటో
Zomato | అయోధ్య (Ayodhya)లో బాలరాముడి ప్రాణ ప్రతిష్ట (Pran Pratishtha) వేళ.. ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో (Zomato) కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం నాడు పలు ఉత్తరాది రాష్ట్రాల్లో నాన్‌వెజ్ (Non Vegetarian) డెలివరీలను తాత్కాలికంగా నిలిపివేసింది.
Zomato | అయోధ్య (Ayodhya)లో బాలరాముడి ప్రాణ ప్రతిష్ట (Pran Pratishtha) వేళ.. ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో (Zomato) కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం నాడు పలు ఉత్తరాది రాష్ట్రాల్లో నాన్‌వెజ్ (Non Vegetarian) డెలివరీలను తాత్కాలికంగా నిలిపివేసింది.
సోమవారం శ్రీరామ జన్మభూమి అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామాలయంలో శ్రీరాముడు బాలావతారంలో కొలువుదీరిన విషయం తెలిసిందే. ఈ ప్రాణ ప్రతిష్ట నేపథ్యంలో పలు రాష్ట్రాలు మాంసం విక్రయాలను నిషేధించాయి. ఈ నేపథ్యంలో నిన్న మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన ఓ కస్టమర్ చికెన్ కోసం జొమాటో యాప్‌లో వెతకగా.. నాన్‌వెజ్ ఫుడ్ అందుబాటులో లేదు.
దీంతో అతడు ‘ఈరోజు (సోమవారం) భోపాల్‌లో జొమాటో సంస్థ చికెన్ డెలివరీ చేయడం లేదు’ అంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. ఈ పోస్టుకు జొమాటో కూడా స్పందించింది. ప్రాణ ప్రతిష్ట వేళ ప్రభుత్వ ఆదేశాల మేరకు నాన్ వెజ్‌ను తాత్కాలికంగా నిషేధించినట్లు తెలిపింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉత్తరప్రదేశ్, అస్సాం, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో నాన్‌వెజ్‌ను డెలివరీ చేయట్లేదని స్పష్టం చేసింది.
Hi, we have disabled delivery of non-veg items in Uttar Pradesh, Assam, Chhattisgarh, Madhya Pradesh and Rajasthan as per govt. notice. Hope this clarification helps!
— zomato care (@zomatocare) January 22, 2024
Also Read..
PM Modi | ఈ మధుర స్మృతులు చిరకాలం నిలిచిపోతాయి.. ప్రాణప్రతిష్ట వీడియో షేర్ చేసిన ప్రధాని మోదీ
Amitabh Bachchan | రామచంద్రకీ జై.. బాలరాముడి దర్శన ఫొటోలను షేర్ చేసిన బిగ్‌బీ
IndiGo | కోల్‌కతా వెళ్తున్న విమానంలో సాంకేతిక సమస్య.. జైపూర్‌కు మళ్లింపు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

