Heroin Seize | భారత్ – బంగ్లా సరిహద్దుల్లో హెరాయిన్ సీజ్..!
Heroin Seize | లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బీఎస్ఎఫ్ సౌత్ బెంగాల్ ఫ్రాంటియర్ భారత్-బంగ్లాదేశ్ అంతర్జాతీయ సరిహద్దుపై నిఘా పెంచింది. ముర్షిదాబాద్ జిల్లా అంతర్జాతీయ సరిహద్దు వద్ద బోర్డర్ పోస్ట్ డీఎంసీ, 149వ కార్ప్స్ 2.2 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నది.
Heroin Seize | లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బీఎస్ఎఫ్ సౌత్ బెంగాల్ ఫ్రాంటియర్ భారత్-బంగ్లాదేశ్ అంతర్జాతీయ సరిహద్దుపై నిఘా పెంచింది. ముర్షిదాబాద్ జిల్లా అంతర్జాతీయ సరిహద్దు వద్ద బోర్డర్ పోస్ట్ డీఎంసీ, 149వ కార్ప్స్ 2.2 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నది. స్మగ్లర్లు భారత్ నుంచి బంగ్లాదేశ్‌కు స్మగ్లింగ్ చేయాలని ప్రణాళిక రూపొందించగా.. భగ్నం చేశారు. పట్టుబడి హెరాయిన్ విలువ మార్కెట్లో రూ.2.2కోట్ల విలువ ఉంటుందని అధికారులు తెలిపారు.
ఆదివారం సాయంత్రం 5.15 గంటల ప్రాంతంలో ప్లాస్టిక్ బ్యాగులతో సరిహద్దుకు సమీపంలో వచ్చిన ముగ్గురు స్మగ్లర్లను సైనికులు గమనించారు. సైనికులను గమనించిన స్మగ్లర్లు ప్యాకెట్లను బంగ్లాదేశ్ సరిహద్దుల్లోకి విసిరేందుకు ప్రయత్నించారు. అవి భారత భూభాగంలోనే పడిపోయాయి. చీకటి కావడంతో మొక్కజొన్న పంట సమీపంలో ఉండడంలో అందులోకి దూరి స్మగ్లర్లు తప్పించుకున్నారు. అనంతరం సంఘటనా స్థలంలో సైన్యం తనిఖీలు నిర్వహించింది. పసుపు రంగు ప్లాస్టిక్ తాడుతో కట్టిన తెలుపు, ఎరుపు రంగు ప్లాస్టిక్ సంచుల్లో తెల్లటి పౌడర్ లభించింది. స్వాధీనం చేసుకున్న పౌడర్‌ను పరీక్షించగా హెరాయిన్‌గా తేలింది. హెరాయిన్‌ను లాల్గోలా పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘రేషన్ షాపుల ద్వారా 14 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలి’
Ramayana | రాష్ట్రపతి భవన్లో ‘రామాయణ’ స్పెషల్ స్క్రీనింగ్!
బూర్గంపహాడ్‌లో ఇసుక అక్రమ రవాణాపై టాస్క్‌ఫోర్స్ దాడులు
Kuravi | అమ్మమ్మ ఇంటికొచ్చి అనంతలోకాలకు.. నీటి గుంతలో పడి తొమ్మిదేళ్ల బాలుడి మృతి
Pneumonic Plague | న్యుమోనిక్ ప్లేగు అంటే ఏమిటి.. ప్లేగులో ఎన్ని రకాలు ఉన్నాయి..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

