ఎల్బీనగర్ ఏసీపీ కార్యాలయంలో కానిస్టేబుల్ ఆత్మహత్య
హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ ఏసీపీ కార్యాలయంలో కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ జె. సాయికుమార్ (PC 13128) ఏసీపీ కార్యాలయంలోని విశ్రాంతి గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ ఏసీపీ కార్యాలయంలో కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ జె. సాయికుమార్ (PC 13128) ఏసీపీ కార్యాలయంలోని విశ్రాంతి గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. బుధవారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం.
సాయికుమార్ 2024 బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుల్. ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఆయన ప్రస్తుతం ఈ-కాప్స్ డ్యూటీ నిమిత్తం ఏసీపీ కార్యాలయానికి అటాచ్ అయ్యారు. కర్మన్‌ఘాట్‌లో స్నేహితులతో కలిసి గదిలో ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సాయికుమార్‌ను కామినేని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
పోలీస్‌స్టేషన్ ఎదుట కుటుంబ సభ్యుల ఆందోళన
సాయికుమార్ మృతితో ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్ ముందు కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్‌నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

