Army Chief | న్యూఢిల్లీ : గతేడాది హతమైన ఉగ్రవాదుల్లో 60 శాతం మంది పాకిస్తాన్ సంతతికి చెందిన వారేనని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది పేర్కొన్నారు. హింసను ప్రేరేపించేందుకు పాకిస్తాన్ పాత్ర ఏంటో ఈ చర్యతో తెలిసి పోతుందన్నారు. జనవరి 15వ తేదీన ఆర్మీ డే సందర్భంగా ఆర్మీ చీఫ్ జనరల్ ఇవాళ మీడియాతో మాట్లాడారు.
పాకిస్తాన్లోని ఉగ్రవాదులు జమ్మూకశ్మీర్లో హింసను ప్రేరేపిస్తున్నారని తెలిపారు. ఉగ్రవాద చర్యలను నిరోధించేందుకు గతేడాది 15 వేల మంది సైనికులను చేర్చుకుకోవడంతో ఎంతో దోహదపడిందని పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్లో పర్యాటకం అభివృద్ధి చెందుతున్న సమయంలోనే ఉగ్రవాదులు తమ చర్యలను వేగం చేశారు. ఈ ఉగ్రవాదుల్లో 80 శాతం మంది పాకిస్తానీలు ఉన్నారని, గతేడాది 60 శాతం మందిని అంతమొందించామని తెలిపారు.
ఇక భారత్, చైనా సైన్యాల మధ్య విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి ప్రయత్నాలు అవసరమని పేర్కొన్నారు. సరిహద్దుల్లో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. సరిహద్దుల్లో మౌలిక సదుపాయాలు పెంచడం, కెపబిలిటీ డెవలప్మెంట్పై దృష్టి సారించామని తెలిపారు. చొరబాటు ప్రయత్నాలను అడ్డుకుంటున్నామని ఆర్మీ చీఫ్ స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
Hardik Pandya – Janhvi Kapoor | హార్దిక్ పాండ్యాతో జాన్వీ కపూర్ డేటింగ్..? నిజమేంటంటే..?
HMPV Case | మరో చిన్నారికి HMPV పాజిటివ్.. భారత్లో 18కి చేరిన కేసులు
Mulayam Singh Yadav | మహా కుంభమేళాలో ములాయం సింగ్ విగ్రహం.. సమాజ్వాదీ పార్టీపై తీవ్ర విమర్శలు