Hardik Pandya – Janhvi Kapoor | క్రికెటర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya), స్టార్ నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) డేటింగ్లో ఉన్నారంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. అందుకు కారణం ఇద్దరూ చనువుగా ఉన్న ఫొటోలు వైరల్ కావడమే. వీరిద్దరూ కలిసి ఇటీవలే మాల్దీవుల్లో విహరించినట్లు ఆ ఫొటోలను బట్టి తెలుస్తోంది. జాన్వీ-పాండ్యా సముద్ర తీరంలో విహరిస్తూ, సన్నిహితంగా కనిపించారు.
ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు హార్దిక్ – జాన్వీ పీకల్లోతు ప్రేమలో ఉన్నారంటూ మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. దీంతో రంగంలోకి దిగిన నేషనల్ మీడియా ఫ్యాక్ట్ చెక్ నిర్వహించగా అసలు విషయం బయటపడింది. ఈ ఫొటోలు నిజం కాదని తేల్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో క్రియేట్ (AI-generated) చేసినవిగా తేల్చింది. దీంతో వీరిద్దరూ డేటింగ్లో ఉన్నారంటూ వచ్చిన వార్తలు కేవలం పుకార్లు మాత్రమే అని స్పష్టమైంది.
కాగా, హార్దిక్ పాండ్యా ఇటీవలే తన భార్య నటాషా స్టాంకోవిక్‌తో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం తన దృష్టిమొత్తం కెరీర్‌పైనే పెట్టాడు. ఇక జాన్వీ కపూర్ వరుస బాలీవుడ్ ప్రాజెక్టులతోపాటు టాలీవుడ్ సినిమాలతో బిజీగా మారిపోయింది.
मालदीव बीच पर रंगरेलिया मना रहे है हार्दिक पंड्या ओर जाह्नवी कपूर
😳😳ये news सही है क्या दोस्तों??? pic.twitter.com/Dq8OuUID9K
— दिव्या कुमारी (@divyakumaari) January 9, 2025
Also Read..
HMPV Case | మరో చిన్నారికి HMPV పాజిటివ్.. భారత్‌లో 18కి చేరిన కేసులు
Mulayam Singh Yadav | మహా కుంభమేళాలో ములాయం సింగ్ విగ్రహం.. సమాజ్‌వాదీ పార్టీపై తీవ్ర విమర్శలు
Laurene Powell Jobs | కుంభమేళాకు స్టీవ్‌జాబ్స్ సతీమణి.. ప్రయాగ్‌రాజ్ చేరుకున్న లారెన్