Earthquake | జమ్మూ కశ్మీర్ (Jammu and Kashmir)లో భూకంపం (Earthquake) సంభవించింది. బారాముల్లా (Baramulla) జిల్లాలో శుక్రవారం మధ్యాహ్నం భూమి ఒక్కసారిగా కంపించింది. భూకంపం తీవ్రత రిక్టరు స్కేలుపై 4.1గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (National Center for Seismology) వెల్లడించింది.
మధ్యాహ్నం 12:26 గంటల సమయంలో ఈ భూ ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు పేర్కొంది. భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లు తెలిపింది. కాగా, భూకంపం తీవ్రత స్వల్ప స్థాయిలోనే ఉండటంతో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదు. ఈ ప్రకంపనలతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా ఇళ్లు, కార్యాలయాల్లో నుంచి బయటకు పరుగులు తీశారు.
An earthquake of magnitude 4.1 on the Richter Scale occurred today at 12:26 IST in Baramulla, Jammu and Kashmir: National Center for Seismology pic.twitter.com/HXM7wRqhwn
— ANI (@ANI) July 12, 2024
Also Read..
70 Hour Work Week | ఎక్కువ పనిగంటలా.. మరణాన్ని ఆహ్వానించడమే : ప్రముఖ న్యూరాలజిస్ట్
Laugh Daily | రోజులో ఒక్కసారైనా నవ్వాల్సిందే.. కొత్త చట్టం తీసుకొచ్చిన జపాన్
Indian 2 | ‘భారతీయుడు 2’ మేనియా.. గుర్రంపై స్వారీ చేస్తూ థియేటర్‌కు.. Video