Laugh Daily | రోజులో ఒక్కసారైనా నవ్వాల్సిందే.. కొత్త చట్టం తీసుకొచ్చిన జపాన్
Laugh Daily | జపాన్ (Japan) ప్రభుత్వం మాత్రం ప్రతి రోజూ అందరూ నవ్వాలని (laugh) చట్టం తీసుకొచ్చింది.
Laugh Daily | ఏ ప్రభుత్వమైనా ప్రజలకు ఉపయోగపడే, నేరాలను అరికట్టే చట్టాలను అమల్లోకి తెస్తారు. అయితే, జపాన్ (Japan) ప్రభుత్వం మాత్రం ప్రతి రోజూ అందరూ నవ్వాలని (laugh) చట్టం తీసుకొచ్చింది. యమగట ప్రిఫెక్చర్ (Yamagata prefecture) ప్రభుత్వం ‘లాఫింగ్ లా’ని తీసుకొచ్చింది. ఈ మేరకు ఆర్డినెన్స్ జారీ చేసింది. పౌరుల శారీరక, మానసిక ఆరోగ్యం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
నవ్వడం ఆరోగ్యానికి మంచిది అంటారు. ఈ క్రమంలో యమగట విశ్వవిద్యాలయంలోని ‘ఫ్యాక్టరీ ఆఫ్ మెడిసిన్’ చేసిన పరిశోధనల్లో తక్కువగా నవ్వే వారిలో కొంతమంది వివిధ వ్యాధులతో మరణిస్తున్నారని తేలింది. ఈ పరిశోధన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రోజులో ఒక్కసారి (Laugh Daily) తప్పకుండా నవ్వాలని చట్టం తీసుకొచ్చింది. పని ప్రదేశంలో నవ్వుతో కూడిన వాతావరణాన్ని ప్రోత్సహించాలంటూ కంపెనీలను కూడా ఆదేశించడం విశేషం. ప్రతినెలా ఎనిమిదో తేదీని ప్రత్యేకంగా ‘హాస్యంతో ఆరోగ్యం’ కోసం కేటాయించాలని సూచించింది.
అయితే, ఈ చట్టంపై స్థానికంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నవ్వొస్తే నవ్వుతారు కానీ కచ్చితంగా రోజులో ఒకసారైనా నవ్వాల్సిందేనని చట్టం తేవడమేంటి అని జపాన్ కమ్యూనిస్టు పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. వ్యక్తిగత కారణాల వల్ల కొంతమంది నవ్వలేకపోవచ్చని పేర్కొన్నారు. ఇలాంటి చట్టాలతో ప్రజల హక్కులను కాలరాయొద్దని తీవ్రంగా మండిపడుతున్నారు. అయితే, విమర్శలను అధికార లిబరల్ డెమోక్రటిక్ పార్టీ కొట్టిపారేసింది. నవ్వడం ప్రజల ఇష్టానికే వదిలేస్తున్నట్లు తెలిపింది. అందుకే నవ్వకపోతే జరిమానా విధిస్తాం వంటి అంశాలను చట్టంలో పొందుపరచలేదని వివరించింది.
Also Read..
Joe Biden | కమలా హ్యారిస్‌కు బదులు యూఎస్ ఉపాధ్యక్షుడు ట్రంప్ అంటూ నోరుజారిన బైడెన్
Anant Weds Radhika | అంబానీ ఇంట గ్రాండ్ వెడ్డింగ్.. భావోద్వేగ వీడియో వైరల్
Arvind Kejriwal | ఈడీ కేసులో కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ ఇచ్చిన సుప్రీంకోర్టు.. అయినా జైల్లోనే
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
TTD Darshan News | తిరుమలలో కొనసాగుతున భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం
Family suicide | గచ్చిబౌలిలోని ఇంట్లో నుంచి దుర్వాసన.. పోలీసులు వచ్చి చూడగా..
Parkinson’s Disease | పార్కిన్సన్స్ వ్యాధి చికిత్సలో కీలక ముందడుగు.. మూలకణాలతో మెరుగైన ఫలితాలు..
Tirumala | శ్రీవారి ఆలయంలో వైభవంగా దీపావళి ఆస్థానం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

