Anant Weds Radhika | అనంత్ అంబానీ (Anant Ambani) – రాధికా మర్చెంట్ (Radhika Merchant ) గ్రాండ్ వెడ్డింగ్‌కు సమయం ఆసన్నమైంది. గత ఏడు నెలలుగా సాగిన ఈ పెళ్లి తంతు చివరి అంకానికి చేరుకుంది. నేడు ముంబై బాంద్రా కుర్లా ప్రాంతంలోని జియో వరల్డ్ కాంప్లెక్స్ ఈ జంట అత్యంత ఘనంగా వివాహ బంధంతో ఒక్కటి కాబోతోంది. ఈ నేపథ్యంలో వీరి వెడ్డింగ్ వేడుకకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.
పెళ్లి తంతులో భాగంగా అంబానీ, వీరేన్ కుటుంబ సభ్యులు గ్రహ శాంతి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరు కుటుంబ సభ్యులు కొంత భావోద్వేగానికి గురయ్యారు. పూజలో భాగంగా రాధిక తల్లి కాబోయే వధూవరులకు విడివిడిగా హారతి ఇచ్చి వేదికపైకి ఆహ్వానిస్తుంది. అనంతరం వరుడు అనంత్ అంబానీకి రాధికా మర్చెంట్ పూలమాల వేసి భావోద్వేగానికి గురవుతుంది. వెంటనే అనంత్ లేచి కాబోయే భార్యను ఆప్యాయంగా హత్తుకుంటాడు. ఆ సమయంలో వధువు తల్లి కంట కన్నీళ్లు వస్తాయి. ఇక రాధిక.. ముకేశ్ అంబానీ, తన తండ్రి వీరేన్ మర్చెంట్‌ను ఆలింగనం చేసుకుంటుంది. ఇందుకు సంబంధించిన వీడియోని ఎపిక్ స్టోరీస్ అనే ఈవెంట్ ప్లానర్ ఇన్‌స్టాలో పోస్టు చేయగా ప్రస్తుతం ఆ వీడియో విపరీతంగా ఆకట్టుకుంటోంది.
అనంత్ అంబానీ – రాధికా మర్చెంట్ వివాహానికి ముంబై నడిబొడ్డున ఉన్న బాంద్రా కుర్లా ప్రాంతంలోని జియో వరల్డ్ సెంటర్ వేదికైంది. ఈ వేడుకకు దేశ విదేశాల నుంచి రాజకీయ నేతలు, పారిశ్రామిక వేత్తలు, క్రీడా ప్రముఖులు అతిథులుగా తరలివస్తున్నారు. హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ సినీ ప్రముఖులు సైతం ఈ వేడుకల్లో పాలుపంచుకోనున్నారు. ఇవాళ ముఖ్య ఘట్టమైన ‘శుభ్ వివాహ్’తో మొదలయ్యే ఈ గ్రాండ్ వెడ్డింగ్.. 13న ‘శుభ్ ఆశీర్వాద్’, 14న ‘మంగళ్ ఉత్సవ్’తో ముగియనున్నాయి.
Also Read..
Joe Biden | కమలా హ్యారిస్‌కు బదులు యూఎస్ ఉపాధ్యక్షుడు ట్రంప్ అంటూ నోరుజారిన బైడెన్
Arvind Kejriwal | ఈడీ కేసులో కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ ఇచ్చిన సుప్రీంకోర్టు.. అయినా జైల్లోనే