Mumbai Rains | మహారాష్ట్ర ముంబైని మరోసారి భారీ వర్షం (Mumbai Rains ) ముంచెత్తింది. సోమవారం కురిసిన వర్షానికే నగరం మొత్తం స్తంభించిపోయిన విషయం తెలిసిందే. తాజాగా శుక్రవారం ఉదయం మరోసారి కుంభవృష్టి కురిసింది. దీంతో రోడ్లన్నీ పూర్తిగా నీట మునిగాయి. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. చెంబూరు, పిడిమెల్లో రోడ్డు, ఏపీఎంసీ మార్కెట్, తుర్భే మాఫ్కో మార్కెట్, కింగ్స్ సర్కిల్ తదితర ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. ఆయా ప్రాంతాల్లో మోకాళ్లలోతు నీరు చేరింది. కుండపోత వర్షానికి నగరం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది.
#WATCH | Maharashtra: Waterlogged roads in King’s Circle area of Mumbai amid heavy rains in the city pic.twitter.com/m3O8uCYmTD
— ANI (@ANI) July 12, 2024
గడిచిన 24 గంటల్లో నగరంలో సగటున 93.16 మి.మీ, శివారు ప్రాంతాల్లో 66.03 మి.మీ నుంచి 78.93 మి.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఈ వర్షం కారణంగా విమాన సర్వీసులకు సైతం తీవ్ర అంతరాయం ఏర్పడింది (flights affected). ప్రస్తుతం ముంబైలో దట్టమైన మేఘాలు ఆవరించడంతో దృశ్యమానత పడిపోయింది. దీంతో ముంబై విమానాశ్రయానికి రాకపోకలు సాగించే పలు విమానాలపై తీవ్ర ప్రభావం పడినట్లు అధికారులు తెలిపారు.
#WATCH | Maharashtra: Waterlogging in several parts of Navi Mumbai after heavy rainfall in the city; visuals from Sanpada Underpass pic.twitter.com/8zQucqu4iv
— ANI (@ANI) July 12, 2024
మరోవైపు శుక్ర, శనివారాల్లో ముంబైలో భారీ వర్షం పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న 3 – 4 గంటల్లో ముంబైలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. వాతావరణ శాఖ హెచ్చరికలతో ముంబై అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
#WATCH | Maharashtra: Heavy rain lashes parts of Mumbai; visuals from Western Express Highway pic.twitter.com/bZZ2XZPyjr
— ANI (@ANI) July 12, 2024
#WATCH | Maharashtra: Overnight incessant rainfall leaves several parts of Navi Mumbai waterlogged.
Visuals from APMC Market and Turbhe Mafco Market. pic.twitter.com/WuHln4PLaR
— ANI (@ANI) July 12, 2024
#WATCH | Maharashtra: Mumbai wakes up to heavy rainfall this morning. Visuals from P D’Mello Road. pic.twitter.com/0riEonQvrA
— ANI (@ANI) July 12, 2024
Also Read..
Nepal | బస్సులు నదిలో కొట్టుకుపోయిన ఘటనలో.. ఏడుగురు భారతీయులు మృతి
President Joe Biden: ప్రెసిడెంట్ పుతిన్ అంటూ జెలెన్స్కీని పరిచయం చేసిన బైడెన్.. వీడియో
Nandigam Suresh | బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు షాక్.. నోటీసులు పంపించిన సీఆర్డీఏ