Nepal | పొరుగు దేశం నేపాల్ (Nepal)లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు త్రిశూలి నదిలో కొట్టుకుపోయింది. ఈ ఘటనలో ఏడుగురు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. సెంట్రల్ నేపాల్‌లోని మదన్-ఆష్రిత్ జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది.
వివరాల్లోకి వెళితే.. నేపాల్‌లో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు ఎక్కడికక్కడ కొండచరియలు (landslide) విరిగిపడుతున్నాయి. శుక్రవారం తెల్లవారుజామున మదన్-ఆష్రిత్ జాతీయ రహదారిపై 66 మంది టూరిస్ట్‌లతో వెళ్తున్న రెండు బస్సులపై (tourist buses) ఒక్కసారిగా కొండచరియలు విరగిపడ్డాయి. దీంతో బస్సులు త్రిశూలి నదిలోకి పడిపోయాయి. ఈ ఘటనలో రెండు బస్సుల్లోని ప్రయాణికులు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయారు.
సమాచారం అందుకున్న స్థానిక అధికారులు, రెస్క్యూ బృందాలు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో ఇప్పటివరకూ ఏడుగురు భారతీయులు మృతి చెందినట్లు తెలిసింది. ప్రస్తుతం నదిలో గల్లంతైన వారి కోసం అధికారులు విస్త్రృతంగా గాలిస్తున్నారు. వర్షాల కారణంగా నదిలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉంది. దీనికితోడు ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా గాలింపు చర్యలకు ఆటంకం కలుగుతున్నట్లు అధికారులు తెలిపారు.
#WATCH | Rescue and search operation underway after two buses carrying around 63 passengers were swept away into the Trishuli River due to a landslide on the Madan-Ashrit Highway in Central Nepal this morning.
(Source: Nepali Army’s ‘X’ handle) pic.twitter.com/hMcwRVaogi
— ANI (@ANI) July 12, 2024
Also Read..
President Joe Biden: ప్రెసిడెంట్ పుతిన్ అంటూ జెలెన్స్కీని పరిచయం చేసిన బైడెన్.. వీడియో
CM Chandrababu | ఊరకరారు మహాత్ములు.. అందులోనూ చంద్రబాబు వంటి మహాత్ములు!
Tripti Dimri | ధనుష్‌తో యానిమల్ భామ త్రిప్తి దిమ్రి ప్రేమాయణం