రామగిరి, డిసెంబర్ 30 : సకల శాస్త్రాలకు మూలం గణితం అని, కావునా పాఠశాల దశలోనే విద్యార్థులకు గణితంపై ఆసక్తి పెంచేలా బోధన సాగించాలని డీఈఓ బొల్లారం భిక్షపతి అన్నారు. నల్లగొండలోని డైట్ కళాశాలలో మంగళవారం తెలంగాణ మ్యాథమెటిక్స్ ఫోరం, దశరథ మెమోరియల్ ఫౌండేషన్ సౌజన్యంతో విద్యార్థులకు నిర్వహించిన జిల్లాస్థాయి గణితం టాలెంట్ టెస్ట్ ముగింపునకు ఆయన ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు వివిధ పోటీ పరీక్షల్లో రాణించేలా తీర్చిదిద్ది వారి బంగారు భవిష్యత్‌కు బాటలు వేయాలని కోరారు. తెలంగాణ గణిత ఫోరం (టీఎంఎఫ్) జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి అద్దంకి సునీల్, కొరివి కృష్ణా, కోశాధికారి అమరేందర్, డైట్ కళాశాల ప్రిన్సిపాల్ కె.నర్సింహ్మ, డీసీఈబీ కార్యదర్శి కొమ్ము శ్రీనివాస్, దశరథ మెమోరియల్ ఫౌండేషన్ కార్యదర్శి కొరిపల్లి సురేశ్ కుమార్, గణిత ఉపాధ్యాయులు రాజు, అష్ర స్అలీ, డి.సైదులు గౌడ్ పాల్గొన్నారు.
టాలెంట్ టెస్ట్‌లో విజేతలకు ఇంగ్లీష్ మీడియంలో బి.దీపన్రెడ్డి, – జెడ్పీహెచ్ఎస్ చిన్నకాపర్తి, చిట్యాల, ఎన్.ఉమా, డి.త్రినైని- జడ్పీహెచ్ఎస్ పాల్వాయి గుర్రంపోడు, తెలుగు మీడియంలో సీహెచ్ నందు, జడ్సీహెచ్‌ఎస్ బాలురులకు సర్టిఫికెట్లతో పాటు నగదు పురస్కారం రూ.5 వేలను అందచేసి అభినందించారు.

Ramagiri : సకాల శాస్త్రలకు మూలం గణితం : డీఈఓ భిక్షపతి