INDW vs SLW : వచ్చే ఏడాది జరుగబోయే పొట్టి ప్రపంచకప్ సన్నాహకాల్లో అజేయంగా దూసుకెళ్తోంది టీమిండియా. వరుసగా నాలుగు మ్యాచుల్లో శ్రీలంకను చిత్తు చేసిన భారత జట్టు క్లీన్‌స్వీప్ లక్ష్యంగా ఐదో మ్యాచ్‌కు సిద్దమైంది. ఈ సిరీస్‌లో రెండోసారి టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ చమరి ఆటపట్టు మళ్లీ బౌలింగ్ తీసుకుంది. ఈ మ్యాచ్‌తో తమిళనాడు క్రికెటర్ జి.కమలిని (G.Kamalini) టీ20ల్లో అరంగేట్రం చేస్తోంది. టాస్కు ముందు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ చేతులు మీదుగా తను డెబ్యూ క్యాప్ అందుకుంది.
స్వదేశంలో రెచ్చిపోతున్న టీమిండియా ఏకపక్షంగా శ్రీలంకను మట్టికరిపిస్తోంది. వైజాగ్‌లో రెండు విజయాలు.. ఆపై త్రివేండ్రంలోనూ లంకను బెంబేలెత్తించిన హర్మన్‌ప్రీత్ సేన వైట్‌వాష్ చేయాలనుకుంటోంది. స్మృతి మంధాన స్థానంలో 17 ఏళ్ల కమలిని తుది జట్టులోకి వచ్చిందని హర్మన్‌ప్రీత్ తెలిపింది. సమిష్టి వైఫల్యంతో సిరీస్ సమర్పించుకున్న శ్రీలంక రెండు మార్పులు చేసింది. కావ్య, షెహానీల బదులు ఇనొకా రణవీర, మాల్తి మడరను తుది జట్టులోకి తీసుకుంది. ఆటపట్టు బృందం ఓదార్పు విజయంతో సిరీస్‌ను ముగిస్తుందా? ఎప్పటిలానే టీమిండియాకు దాసోహమవుతుందా? చూడాలి.
A look at #TeamIndia‘s Playing XI for the 5⃣th T20I 🙌
G. Kamalini is all set to make her T20I debut 🧢
Updates ▶️ https://t.co/E8eUdWSQXs#INDvSL | @IDFCFIRSTBank pic.twitter.com/9LzWfFD6RU
— BCCI Women (@BCCIWomen) December 30, 2025
భారత తుది జట్టు : షఫాలీ వర్మ, జి.కమలిని, హర్లీన్ డియోల్, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), రీచా ఘోష్(వికెట్ కీపర్), అమన్‌జోత్ కౌర్, దీప్తి శర్మ, స్నేహ్ రానా, వైష్ణవీ శర్మ, క్రాంతి గౌడ్, శ్రీ చరణి.
శ్రీలంక తుది జట్టు : చమరి ఆటపట్టు(కెప్టెన్), హాసిని పెరీరా, హర్షిత సమరవిక్రమ, కవిశ దిల్హరి, నిలాక్షి డిసిల్వా, ఇమేశా దులానీ, కుశాని నుత్యంగన(వికెట్ కీపర్), రష్మిక సెవ్వండి, ఇనొక రణవీర, మాల్తి మడర, నిమేశ మధుషానీ.