రామన్నపేట, డిసెంబర్ 30 : గ్రామ పౌరులు, యువత, అన్ని వర్గాల వారు గ్రామ అభివృద్ధికి సహకరించాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకుడు, రామన్నపేట మండలం పల్లివాడ సర్పంచ్ కంభంపాటి శ్రీనివాసులు కోరారు. మంగళవారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో వ్యాపారులు, వార్డు సభ్యులతో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిషేధిత గుట్కాలు, సిగరెట్లు, మత్తు పానీయాలు అమ్మి యువతను అనారోగ్యం పాలు చేయొద్దని వ్యాపారులను కోరారు. వ్యవసాయ పొలాలు దున్నే ట్రాక్టర్లు ఫుల్ వీల్స్ తో రోడ్డుపై వెళ్లి రోడ్డు చెడిపోవడానికి కారణమైతే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. చికెన్ సెంటర్ లో యజమానులు వ్యర్ధాలను డంపింగ్ యార్డులో పడవేయాలని సూచించారు. అందరూ గ్రామం కోసం, గ్రామ అభివృద్ధి కోసం సహకరించాలని కోరారు.