Arvind Kejriwal | ఈడీ కేసులో కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ ఇచ్చిన సుప్రీంకోర్టు.. అయినా జైల్లోనే
Arvind Kejriwal | మద్యం పాలసీ కేసు (Delhi excise policy case)లో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ (AAP National Convener), ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు భారీ ఊరట లభించింది.
Arvind Kejriwal | మద్యం పాలసీ కేసు (Delhi excise policy case)లో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ (AAP National Convener), ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు భారీ ఊరట లభించింది. ఈ కేసులో ఆయనకు సుప్రీంకోర్టు (Supreme Court) మధ్యంతర బెయిల్ (interim bail) మంజూరు చేసింది. లిక్కర్ స్కామ్ కేసులో తనను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం.. సీఎంకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా సుప్రీం ధర్మాసనం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసు పూర్తిస్థాయి విచారణ కోసం ఐదుగురు సభ్యుల విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తూ తీర్పు ఇచ్చింది.
Supreme Court grants interim bail to Delhi Chief Minister and AAP National Convener Arvind Kejriwal in the Delhi excise policy case.
The Apex Court refers his petition challenging his arrest by the Enforcement Directorate (ED) to a larger bench. pic.twitter.com/9s40JBWJhV
— ANI (@ANI) July 12, 2024
కాగా, ఈ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు రౌస్ అవెన్యూ కోర్టు గత నెల 20న బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీ హైకోర్టులో అప్పీల్‌కు వెళ్లేందుకు బెయిల్ ఉత్తర్వులపై 48 గంటల పాటు నిలుపుదల చేయాలన్న ఈడీ అభ్యర్థనను ప్రత్యేక జడ్జి నియయ్ బిందు తిరస్కరించారు. రూ.లక్ష వ్యక్తిగత బాండ్ పూచీకత్తుపై కేజ్రీవాల్‌ను విడుదల చేయాలని ఆదేశించారు. అయితే, ట్రయల్ కోర్టు తీర్పును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ మేరకు గత నెల 21న ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.
ఈడీ తరపు న్యాయవాది ఏఎస్జీ ఎస్వీ రాజు వాదించారు. కేజ్రీవాల్ బెయిల్ దరఖాస్తును వ్యతిరేకించేందుకు దర్యాప్తు సంస్థకు పూర్తి అవకాశం ఇవ్వలేదని హైకోర్టుకు తెలియజేశారు. కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలని కోరారు. ఈ క్రమంలో విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్ ఉత్తర్వులపై స్టే విధించింది. ఇక బెయిల్‌పై ఢిల్లీ హైకోర్టు మధ్యంతర స్టే ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ సర్వోన్నత న్యాయస్థాన్నా ఆశ్రయించారు. దీనిపై శుక్రవారం విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం తాజాగా మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు ఇచ్చింది.
అయితే, సుప్రీం బెయిల్ మంజూరు చేసినప్పటికీ కేజ్రీవాల్ జైల్లోనే ఉండాల్సి ఉంటుంది. ఇదే కేసులో కేజ్రీవాల్ ప్రస్తుతం సీబీఐ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. తిహార్ జైలులో ఉన్న అరవింద్ కేజ్రీవాల్‌ను జూన్ 21న సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కోర్టు మూడురోజుల కస్టడీకి ఇచ్చింది. మళ్లీ జూన్ 29న ఆయనను సీబీఐ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరుచగా.. కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఆ తర్వాత ఈ నెల 12 వరకూ కేజ్రీవాల్ కస్టడీని కోర్టు పొడిగించింది. ప్రస్తుతం తీహార్ జైలులో సీబీఐ కస్టడీలో ఉన్నారు. ఈ క్రమంలో కేజ్రీవాల్ సీబీఐ అరెస్టును ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేశారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది.
2021-22 సంబంధించిన మద్యం పాలసీ కేసులో మార్చి 21న అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేసింది. లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది. ఆ తర్వాత జూన్ 2న తిరిగి కోర్టులో లొంగిపోయారు. వైద్యపరమైన కారణాలతో ఏడువారాల పాటు మధ్యంతర బెయిల్‌ను కోరగా.. జూన్ 5న ట్రయల్ కోర్టు తిరస్కరించింది. తాజాగా రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. కోర్టు అనుమతి ఇచ్చింది. ఈడీ హైకోర్టును ఆశ్రయించగా స్టే విధిస్తూ ఆదేశాలు ఇచ్చింది.
Also Read..
Nepal | బస్సులు నదిలో కొట్టుకుపోయిన ఘటనలో.. ఏడుగురు భారతీయులు మృతి
Gujarat | బయటపడ్డ మరో బాగోతం.. బీజేపీ పాలిత గుజరాత్లో నకిలీ దవాఖాన!
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

