Indian 2 | ‘భారతీయుడు 2’ మేనియా.. గుర్రంపై స్వారీ చేస్తూ థియేటర్‌కు.. Video
Indian 2 | విలక్షణ నటుడు కమల్ హాసన్ నటించిన తాజా చిత్రం ‘భారతీయుడు 2’ (Indian 2). 1996లో వచ్చిన భారతీయుడు చిత్రానికి సీక్వెల్ ఇది.
Indian 2 | విలక్షణ నటుడు కమల్ హాసన్ నటించిన తాజా చిత్రం ‘భారతీయుడు 2’ (Indian 2). 1996లో వచ్చిన భారతీయుడు చిత్రానికి సీక్వెల్ ఇది. స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar) దర్శకత్వం వహించిన ఈ చిత్రం నేడు (జులై 12) తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా విడుదలైంది. దీంతో కమల్ హాసన్ ఫ్యాన్స్ థియేటర్స్‌కు క్యూ కడుతున్నారు.
చెన్నై (Chennai)లో ఓ అభిమాని భారతీయుడు 2 చిత్రాన్ని చూసేందుకు వినూత్న రీతిలో థియేటర్ వద్దకు ఎంట్రీ ఇచ్చాడు. సినిమాలో కమల్ పోషించిన పాత్రను అనుసరిస్తూ డ్రెస్ ధరించి.. తెల్లటి గుర్రంపై స్వారీ చేస్తూ థియేటర్ వద్దకు చేరుకున్నాడు. చేతిలో భారతీయ జెండాను ఊపుతూ కనిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గామారింది.
Cool Suresh இன் அலப்பறை 🥳#coolsuresh #indian2 #celebration #moviecelebration #kollywood #kamalhaasan pic.twitter.com/Hp3GwhYrLM
— InandOut Cinema (@inandoutcinema) July 12, 2024
కమల్- శంకర్ కాంబినేషన్లో 1996లో రిలీజైన భారతీయుడు చిత్రం ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఈ సినిమా విడుదలైన 28 ఏండ్ల తర్వాత దీనికి సీక్వెల్ రాబోతుండడంతో మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. సిద్ధార్థ్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, ఎస్జే సూర్య, సిద్దార్థ్, గుల్షన్ గ్రోవర్లు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ -రెడ్ జియాంట్ మూవీస్ పై ఉదయనిధి స్టాలిన్-సుభాస్కరన్ నిర్మించగా.. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు.
Also Read..
Bharateeyudu 2 | ‘భారతీయుడు 2’ నిర్మాత నిర్ణయం కరెక్టేనా?
Bharateeyudu 2 Review | కమల్ హాసన్ సేమ్ మ్యాజిక్ రిపీట్ చేశాడా..? శంకర్ భారతీయుడు 2 ఎలా ఉందంటే..!
Anant Weds Radhika | అంబానీ ఇంట గ్రాండ్ వెడ్డింగ్.. భావోద్వేగ వీడియో వైరల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

