Bharateeyudu 2 Review | ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌పై ప్రయోగాలు చేసే విషయంలో ఎంతటి రిస్క్ అయినా చేసే యాక్టర్లలో టాప్‌లో ఉంటాడు ఉలగనాయగన్ కమల్ హాసన్ (Kamal Haasan). ఇండియాను పట్టి పీడిస్తున్న అవినీతి, లంచం లాంటి అంశాలను కమల్ హాసన్ టైటిల్ రోల్లో భారతీయుడు సినిమాతో సిల్వర్ స్క్రీన్‌పై చూపించి.. అప్పట్లోనే గ్లోబల్ బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు శంకర్.
ఈ స్టార్ డైరెక్టర్ మళ్లీ 28 ఏండ్ల తర్వాత ఉలగనాయగన్ అదే కథాంశంతో తెరకెక్కించిన సీక్వెల్ ఇండియన్ 2 (Indian 2). దశావతారంలో స్టన్నింగ్ గెటప్స్‌తో మెస్మరైజ్ చేసిన కమల్ హాసన్.. భారతీయుడు 2లో కూడా అలాంటి అవతారాల్లోనే కనిపించాడు. సిల్వర్ స్క్రీన్‌పై ఆల్ టైమ్ సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 మరి ఫైనల్‌గా నేడు తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేస్తోంది. తెలుగులో భారతీయుడు 2గా విడుదలైంది. ఇప్పటివరకు థియేటర్లు, సోషల్ మీడియాలో వచ్చిన టాక్ ప్రకారం ఇండియన్ 2 ఎలా ఉందో తెలుసుకుందాం..
తారాగణం..
కమల్ హాసన్, కాజల్ అగర్వాల్, సిద్దార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ఎస్జే సూర్య, గుల్షన్ గ్రోవర్, బాబీ సింహా తదితరులు
కథ, దర్శకత్వం: శంకర్
డైలాగ్స్ : బి జయమోహన్, కబిలన్ వైరముత్తు, లక్ష్మి శ్రవణ కుమార్
నిర్మాణ సంస్థలు: లైకా ప్రొడక్షన్స్, రెడ్ జియాంట్ మూవీస్
నిర్మాతలు: సుబాస్కరన్, ఉదయనిధి స్టాలిన్
సినిమా ఎలా మొదలైంది.. కథ ఏంటంటే..?
అవినీతి అంశాల చుట్టూ తిరిగే సన్నివేశాలతో శంకర్ స్టైల్లో మొదలవుతుంది ఇండియన్ 2. మెల్లగా సిద్దార్థ్ సింపుల్ ఇంట్రడక్షన్‌తో సిల్వర్ స్క్రీన్‌పైకి ఎంట్రీ ఇస్తాడు. దేశవ్యాప్తంగా అవినీతి రోజురోజుకీ ఎలా పెరిగిపోతుందో తెలియజేసేలాసిద్దార్థ్ అండ్ గ్యాంగ్ సోషల్ మీడియాలో వీడియోలు చేస్తూ ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తుంటారు. అటు నుంచి రకుల్ ప్రీత్ సింగ్ పరిచయం ఉంటుంది. కట్ చేస్తే.. కథ తైవాన్‌కు మారిపోతుంది.
ఇక మొదటి సాంగ్ టైం.. క్యాలెండర్ సాంగ్‌తో బాలీవుడ్ యాక్టర్ గుల్షన్ గ్రోవర్ స్టైలిష్ ఎంట్రీ ఇస్తాడు. అసలు ఇండియన్ 2ఎంట్రీ ఎప్పుడెప్పుడు ఉంటుందా..? అని ఎదురుచూస్తున్న ప్రేక్షకుల కోసం ఉలగనాయగన్ వస్తాడు. సేనాపతిగా ఎంట్రీ ఇచ్చిన కమల్ హాసన్ మార్షల్ ఆర్ట్స్‌లో స్కిల్స్‌ను సిల్వర్ స్క్రీన్‌పై ప్రజెంట్ చేసే సన్నివేశాలుంటాయి. ఇక అవినీతి రాజ్యమేలుతున్న భారతదేశంలోకి సేనాపతి ప్రవేశం అనివార్యమైన సందర్భంలో ఇండియాలో ల్యాండింగ్ అవుతాడు సేనాపతి. ఇప్పుడు సేనాపతిగా టైటిల్ రోల్‌ను ఎలివేట్ చేసేలా తాత వస్తడే సాంగ్ ఉంటుంది. శంకర్ మార్క్ విజువల్స్‌తో గ్రాండ్‌గా సాగే ఈ పాట సినిమాకు హైలెట్‌గా చెప్పొచ్చు. అనంతరం సిద్దార్థ్ అండ్ గ్యాంగ్‌పై వచ్చే కొన్ని సన్నివేశాలుంటాయి.
సెకండాఫ్ ఇలా..
ఇక బాబీ సింహా చుట్టూ తిరిగి ఇన్వెస్టిగేటివ్ సన్నివేశాలతో సెకండాఫ్ షురూ అవుతుండగా.. మరోవైపు రకుల్ ప్రీత్ సింగ్ ఫ్యామిలీ సీన్లు వస్తాయి. అప్పటిదాకా ఒక మాదిరిగా సాగిన కథ కొంచెం సీరియస్ మూడ్‌లో వచ్చేస్తుంది. ఇక్కడే తెలుగు వెర్షన్లో రాంచరణ్ అభిమానులకు ఒక సర్ప్రైజ్ ఉంటుంది. కొన్ని భావోద్వేగ సన్నివేశాల తర్వాత కీలక మలుపు ఎంటో తెలుస్తోంది. కమల్ హాసన్ చేజింగ్ సీక్వెన్స్, ముష్కరమూకలతో ఫైట్ సీక్వెన్స్ వన్ మ్యాన్ షోలా సాగుతుంది. చిన్నపాటి ట్విస్ట్ ఇస్తూ ఊహించని విధంగా సినిమాకు శుభం కార్డు పడుతుంది.
ఎలా ఉందంటే..?
కమల్ హాసన్, సిద్దార్థ్ అండ్ గ్యాంగ్ సన్నివేశాలతో ఒకే అన్నట్టుగా సాగుతుంది. కొన్ని సన్నివేశాలు బాగానే వర్కవుట్ అయినా.. మరికొన్ని సీన్లు మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఫెయిలయ్యాయనే భావన ప్రేక్షకుల్లో కలుగుతుంది. విజువల్స్ క్లీన్‌గా ఉన్నప్పటికీ.. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇంకా గట్టిగా ఇచ్చి ఉంటే బాగుంటుందని మూవీ వలర్స్ అభిప్రాయపడుతున్నారు.
వన్ మ్యాన్ ఆర్మీ షోలా..
కమల్ హాసన్ స్టన్నింగ్ పర్ఫార్మెన్స్తో వన్ మ్యాన్ ఆర్మీ షోలా సెకండాఫ్ సాగుతుంది. ఎప్పటిలాగే మరో బలమైన సామాజిక సందేశాన్ని అందించే ప్రయత్నం చేశాడు శంకర్. కానీ ఈ సారి మాత్రం ఎగ్జిక్యూషన్లో కొంత వెనకబడ్డాడనే టాక్ వస్తోంది. చివరి 30 నిమిషాల్లో వచ్చే సన్నివేశాలు మాత్రం కళ్లార్పకుండా చూసేలా గూస్బంప్స్ తెప్పించే సన్నివేశాలతో సాగుతుంది. శంకర్‌కు పర్ఫెక్ట్ కమ్ బ్యాక్ ఇది అని అంటున్నారు నెటిజన్లు.
సాధారణంగా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఫస్ట్ పార్టు సక్సెస్ అయినంతగా సీక్వెల్స్ అవవు. భారతీయుడు 2 కూడా ఇదే రూట్లో పయనిస్తూ ఫస్ట్ పార్టుతో పోలిస్తే ప్రేక్షకులను ఇంప్రెస్ చేయడంలో వెనకపడిందని పలువురు నెటిజన్లు చెబుతున్నారు.
#Indian2 #Bharateeyudu2 attempts to deliver a powerful message, but Shankar’s execution falls short. While certain early sequences and poignant moments later excel, excessive dragging parts and uninspired drama hamper the overall narrative. The trailer of #Indian3 at the movie’s… pic.twitter.com/zt15vfiubY
— Review Rowdies (@review_rowdies) July 12, 2024
2nd half lo goback Indian anapudu
Kamal sir walking emotionally
Master class BGM by @anirudhofficial @arrahman souraa sad version ❤️💔#Bharateeyudu2
— 🌶️ (@HAIL__SSMB) July 12, 2024
The movie “#Indian2” is receiving positive responses from Telugu audiences. Don’t trust fake reviews. Congratulations to #KamalHaasan𓃵 Sir.#Indian2Review #Bharateeyudu2 #Indian3 #Indian2FromToday https://t.co/pC2XZT6WDg
— Sai Krishna madamshetty (@MadamshettySai) July 12, 2024
#Indian2 #Bharateeyudu2 2nd half is better with good last 20 mins, overall no where in comparison with part 1 but decent movie with some good sequences, keep your expectations low to enjoy
— Power boy (@pablo_prasad) July 12, 2024
#Bharateeyudu2 Review:💯💯@ikamalhaasan acted well in badly written scenes#Siddharth 💯👏🏼@shankarshanmugh disappointed
Entire movie could be trimmed properly & made as 1st half
Killing scenes👎🏼
Climax fight good
3rd part glimpse🔥Below Avg!
2.25/5#Indian2 #Indian2Review pic.twitter.com/R6RBf1cRAR— Amjad Ali (@amjadali70093) July 12, 2024