సాయిబాబాపై సినీనటి మాధవీలత అనుచితవ్యాఖ్యలు
సినీనటి మాధవీలతపై హైదరాబాద్ సరూర్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. మాధవీలతోపాటు మరో 13 మంది సాయిబాబాపైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ షిర్డీసాయి భక్త ఐక్యవేదిక ప్రతినిధులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు.
ఎల్బీనగర్, డిసెంబర్ 29 : సినీనటి మాధవీలతపై హైదరాబాద్ సరూర్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. మాధవీలతోపాటు మరో 13 మంది సాయిబాబాపైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ షిర్డీసాయి భక్త ఐక్యవేదిక ప్రతినిధులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. సాయిబాబా, సాయిబాబా మందిరాలపై విషప్రచారం చేస్తూ, భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారని నవంబర్ నెలాఖరులో ఫిర్యాదు అందినట్టు తెలిసింది.
ఈ నేపథ్యంలో పోలీసులు న్యాయస్థానం అనుమతి తీసుకుని తాజాగా కేసు నమోదు చేశారని సమాచారం. ఈ అంశంపై ఇన్స్పెక్టర్ సైదిరెడ్డి మాట్లాడుతూ ‘సాయిబాబాపై దేవుడే కాదు’ అంటూ మాధవీలత, మరికొందరు యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వేదికలుగా ప్రచారం చేస్తున్నట్టుగా షిరిడీ సాయి భక్త ఐక్య వేదిక అధ్యక్షుడు మంచికంటి ధనుంజయ్గుప్తా ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

