హైదరాబాద్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ) : విద్యుత్తు సంస్థలను ప్రైవేటీకరిస్తే ఊరుకోబోమని తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ హెచ్చరించింది. రామగుండం, పాల్వంచ పవర్ప్లాంట్లను టీజీ జెన్కో ద్వారానే నిర్మించాలని డిమాండ్ చేసింది. జేఏసీ సమావేశాన్ని సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించారు.
అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. జేఏసీ చైర్మన్‌గా జీ సాయిబాబు, సెక్రటరీ జనరల్‌గా శ్రీధర్, కన్వీనర్‌గా పీ రత్నాకర్‌రావు, కో కన్వీనర్‌గా బీసీరెడ్డిని ఎన్నుకున్నారు.