హైదరాబాద్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ) : జీహెచ్ఎంసీ పునర్విభజనకు అనుకూలంగా ఇక్కడి 3 పోలీసు కమిషనరేట్లను నాలుగుగా పునర్వ్యవస్థీకరిస్తూ ప్రభుత్వం సోమవా రం ఉత్తర్వులు జారీచేసింది. కమిషనరేట్లను హైదరాబాద్, సైబరాబాద్, మ ల్కాజిగిరి, ఫ్యూచర్ సిటీగా విభజించింది. రాచకొండ కమిషనరేట్‌ను రద్దు చేసి కొత్తగా ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి కమిషనరేట్లను ఏర్పాటు చేశారు.
ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్‌గా సుధీర్‌బాబును, సైబరాబాద్ సీపీగా ఉన్న అవినాష్ మహంతీని మల్కాజిగి రి కమిషనరేట్ సీపీగా నియమించిం ది. ఎం రమేశ్‌ను సైబరాబాద్ సీపీగా నియమించింది. రాచకొండ పరిధిలో ఉన్న యాదాద్రి భువనగిరి జిల్లాను తొలగించింది. దీంతో యాద్రాద్రి భువనగిరి జిల్లా ఎస్పీగా అక్షాంశ్ యాదవ్‌ను నియమించింది.