యూరియా కోసం మళ్లీ నిరసన.. గద్వాల పీఏసీసీఎస్కు 450 బస్తాలు రాక
కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు కష్టాలు తప్పడం లేదు.. మొన్నటి వరకు యూరియా కోసం అరిగోస పడగా.. మళ్లా యూ రి యా కష్టాలు కర్షకన్నకు దాపురించాయి. జోగుళాంబ గద్వాల జిల్లాలో సరాసరి 1.95 లక్షల ఎకరా ల్లో వివిధ పంటలు సాగు చేయనున్నట్లు అధికారులు అంచనా వే శారు. అయితే అంచనాకు అనుగుణంగా ఎరువులు సరఫరా చేయడంలో మాత్రం ప్ర భుత్వం పూర్తిగా విఫలమైందని రైతులు ఆరోపించారు.
- ఉదయం నుంచే బారులు
- 100 మందికి అందిన బస్తాలు.. నిరాశతో వెనుతిరిగిన మరో 50 మంది
గద్వాల, డిసెంబర్ 29 : కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు కష్టాలు తప్పడం లేదు.. మొన్నటి వరకు యూరియా కోసం అరిగోస పడగా.. మళ్లా యూ రి యా కష్టాలు కర్షకన్నకు దాపురించాయి. జోగుళాంబ గద్వాల జిల్లాలో సరాసరి 1.95 లక్షల ఎకరా ల్లో వివిధ పంటలు సాగు చేయనున్నట్లు అధికారులు అంచనా వే శారు. అయితే అంచనాకు అనుగుణంగా ఎరువులు సరఫరా చేయడంలో మాత్రం ప్ర భుత్వం పూర్తిగా విఫలమైందని రైతులు ఆరోపించారు. సోమవారం గద్వాల పీఏసీసీఎస్కు 450 బస్తాల యూరియా రాగా విషయం తెలుసుకొన్న రైతులు తెల్లవారుజామున 150 మందికిపైగా రైతులు అక్కడికి చేరుకున్నారు. దాదాపు ఐదారు గంటలు బా రులు తీరారు. పాస్బుక్కుపై ఎకరాకు రెండు, మూడు యూరియా బస్తాలను సిబ్బంది పంపిణీ చేశారు. దీంతో 100 మందికిపైగా రైతులకు యూరియా అందగా.. మిగితా వారు నిరాశతో అక్కడి నుంచి వెనుతిరిగారు. ప్రస్తుతం ఉన్న రైతులకే యూరియాను సరఫరా చేయలేని ప్రభుత్వం యాప్ ద్వారా సరఫరా చేస్తామని చెప్పడం చూస్తుంటే రైతులకు అవసరమైన యూరియా సరఫరా చేయలేక ఈ యాప్ను తీసుకొస్తున్నట్లు తెలుస్తుంది. యూరియా కోసం వచ్చిన కొందరి రైతులకే టోకెన్లు దొరకడం.. మిగతా వారికి దొరక్క పోవడంతో నిరాశతో వెనుదిరిగారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులకు అవసరమైన యూరియా సరఫరా చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
యూరియా ఇవ్వడంలో సర్కారు విఫలం
వానకాలం సీజన్లో రైతన్నలు యూరియా కోసం ఆందోళనలు చేసినా సరిపడా అందించడంలో ప్రభు త్వం విఫలమైంది. కనీసం యాసంగిలో అయినా కష్టాలు తప్పుతాయని భావించినా మళ్లీ నిరాశే మిగిలింది. అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఒకటి, రెండు బ్యాగుల యూరియా కోసం రైతులు తెల్లవారు జాము నుంచే పనులు వదులుకొని క్యూలో నిలబడుతున్నారు. రైతు భరోసా ఎలా గో రాలేదు.. ప్రభుత్వం సబ్సిడీపై ఇచ్చే యూరియానైనా సరిపడా ఇస్తుందా? అంటే అదీ లేదని వాపోతున్నారు. గద్వాల జిల్లాలో జూరాల, నెట్టెంపాడ్తోపాటు బోరు బావుల కింద రైతులు పెద్ద మొత్తంలో రైతులు పంటలు సాగు చేస్తున్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

