Bharateeyudu 2 | ‘భారతీయుడు 2’ నిర్మాత నిర్ణయం కరెక్టేనా?
Bharateeyudu 2 | భారీ బడ్జెట్ తో రూపొందించే ప్రతి పెద్ద సినిమాలకు టిక్కెట్ల రేటు పెంచుకునేందుకు అనుమతులు కోరుతుంది సదరు నిర్మాణ సంస్థ. శంకర్ దర్శకత్వం వహించిన భారతీయుడు-2 చిత్రం ఈ శుక్రవారం విడుదల కు సిద్దమైన సంగతి తెలిసిందే.
Bharateeyudu 2 | భారీ బడ్జెట్ తో రూపొందించే ప్రతి పెద్ద సినిమాలకు టిక్కెట్ల రేటు పెంచుకునేందుకు అనుమతులు కోరుతుంది సదరు నిర్మాణ సంస్థ. శంకర్ దర్శకత్వం వహించిన భారతీయుడు-2 చిత్రం ఈ శుక్రవారం విడుదల కు సిద్దమైన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రానికి కూడా టిక్కెట్ల రేట్లు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరింది సదరు చిత్ర నిర్మాణ సంస్థ . వారి కోరిక మేరకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది తెలంగాణా ప్రభుత్వం. మల్టీ ప్లెక్స్ ల్లో 75 రూపాయలతో పాటు సింగిల్ స్క్రీన్ లో 50 రూపాయల వరకు రేటు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది.
కొన్ని సినిమాలకు టిక్కెట్ల రేట్ల పెంపుదల కలిసి వస్తే.. కొన్ని సినిమాలకు మైనస్ గా మారుతుంది. ఇటీవల విడుదలైన ప్రభాస్ హీరోగా, నాగ్ అశ్విన్ రూపొందించిన `కల్కి 2898 ఏడీ’ ప్రపంచవ్యాప్తంగా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలుసు. కానీ టిక్కెట్ల రేటు పెంచడంతో చాలా మంది మిడిల్ క్లాస్ ఆడియన్స్ థియెటర్లకు వెళ్లి చూడలేక పోయారు. భారతీయుడు 2 విషయానికొస్తే దాదాపుగా 28 సంవత్సరాల క్రితం శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ కథానాయకుడిగా వచ్చిన ‘భారతీయుడు’ సినిమా ఎంత ఘన విజయం సాధించిందో తెలిసిన విషయమే.
ఈ సినిమాకు సీక్వెల్ గా భారతీయుడు 2 నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రాన్ని తెలుగులో డబ్బింగ్ సినిమాగానే పరిగణిస్తారు. అయితే ఈ చిత్రానికి టిక్కెట్ల రేట్లు పెంచడం సబబేనా అని కొందరు అనుకుంటున్నారు. ఈ టిక్కెట్ల రేటు పెరగడం వలన మిడిల్ క్లాస్ ఆడియన్స్ మల్టీ ప్లెక్స్ ల్లో సినిమాలను చూడాలనే ఆసక్తిని వదులుకుంటున్నారు. దర్శకుడు శంకర్ రూపొందించే అన్ని సినిమాలు మెసేజ్ ఓరియెంటెడ్ గా ఉంటాయి అన్న సంగతి తెలిసిందే. అన్ని వర్గాల అభిమానులు ఈ సినిమాను చూసే విధంగా టిక్కెట్ ధర ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఫ్యాన్స్ టాక్. భారతీయుడు -2 సినిమాను తెలంగాణలో సురేష్ ప్రొడక్షన్ రిలీజ్ చేస్తుంది. 28 సంవత్సరాల తరువాత రాబోతున్న భారతీయుడు-2 సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే టిక్కెట్ ధరలు పెంచడం వలన ఈ చిత్రం కలెక్షన్స్ భారీగా వసూలు చేస్తుందంటారా అని కొందరు అభిమానుల అభిప్రాయం. ‘కల్కి 2898 ఏడీ’ చిత్ర యూనిట్ చేసిన తప్పే ఈ భారతీయుడు -2 నిర్మాణ సంస్థ చేస్తుందని విశ్లేషకుల మాట. భారతీయుడు-2 లో ఇండియన్ లెజెండ్ కమల్ హాసన్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవాని శంకర్, ఎస్ జే సూర్య, సిద్ధార్థ, గుల్ష్ న్ గ్రోవర్ లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ -రెడ్ జియాంట్ మూవీస్ పై ఉదయనిధి స్టాలిన్ -సు భాస్కరన్ నిర్మిస్తున్నారు. ఈ సనిమాకు సంగీతం : అనిరుధ్ రవి చందర్ అందిస్తున్నారు.
Also Read..
- B Nagendra: వాల్మీకి కార్పొరేషన్ స్కామ్.. ఈడీ అదుపులో మాజీ మంత్రి
- RC16 | అఫీషియల్.. రాంచరణ్ ఆర్సీ 16లో కన్నడ స్టార్ హీరో
- Joe Biden | కమలా హ్యారిస్కు బదులు యూఎస్ ఉపాధ్యక్షుడు ట్రంప్ అంటూ నోరుజారిన బైడెన్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

