RC16 | టాలీవుడ్ స్టార్ హీరో రాంచరణ్ (Ram charan) ఉప్పెన ఫేం బుచ్చిబాబు సాన (Buchi Babu Sana) దర్శకత్వంలో RC16 చేస్తున్నాడని తెలిసిందే. ఆర్సీ 16 హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా లాంఛ్ కూడా అయింది. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీకపూర్ హీరోయిన్గా నటిస్తోంది. దేవర తర్వాత జాన్వీకపూర్ నటిస్తోన్న రెండో తెలుగు సినిమా ఇది. చాలా రోజుల తర్వాత మేకర్స్ స్టన్నింగ్ న్యూస్‌ను అందరితో పంచుకున్నారు.
ఈ చిత్రంలో పాపులర్ కన్నడ స్టార్ హీరో శివరాజ్‌కుమార్ భాగమయ్యాడు. ఆర్సీ16లో ఆయన ఇమేజ్ను ప్రతిబింబించే పవర్ ఫుల్ రోల్లో శివరాజ్‌కుమార్ కనిపించబోతున్నారు. ఆర్సీ 16 టీంలోకి శివరాజ్‌కుమార్‌కు స్వాగతం అంటూ స్పెషల్ లుక్ విడుదల చేశారు మేకర్స్. ఈ లుక్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇంతకీ ఈ స్టార్యాక్టర్ను ఎలా చూపించబోతున్నాడన్నది సర్వత్రా ఉత్కంఠ రేకెత్తిస్తోంది.
స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో రాబోతున్న ఆర్సీ 16 చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఈ మూవీలో కథానుగుణంగా రాంచరణ్ ఉత్తరాంధ్ర మాండలికంలో మాట్లాడనున్నాడని ఫిలింనగర్ సర్కిల్ఇన్సైడ్ టాక్. ఈ చిత్రాన్ని సుకుమార్ రైటింగ్స్-మైత్రీ మూవీ మేకర్స్-వృద్ధి సినిమాస్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి.
Welcoming ‘Karunada Chakravarthy’ @NimmaShivanna on board for a pivotal role that resonates with his stature 🔥
Team #RC16 wishes #Shivanna a very Happy Birthday ✨#RamCharanRevolts
Global Star @AlwaysRamCharan #JanhviKapoor @BuchiBabuSana @arrahman @RathnaveluDop @artkolla… pic.twitter.com/nMvgvvTfMR— Sukumar Writings (@SukumarWritings) July 12, 2024
Bharateeyudu 2 Review | కమల్ హాసన్ సేమ్ మ్యాజిక్ రిపీట్ చేశాడా..? శంకర్ భారతీయుడు 2 ఎలా ఉందంటే..!
Maharaja | ఓటీటీలోకి విజయ్ సేతుపతి మహారాజ.. ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందంటే..?