రాయపోల్ జనవరి 01: నూతన మండల విద్యాధికారిగా రాజగోపాల్ రెడ్డి (Rajagopal Reddy) అధికారికంగా పదవి బాధ్యతలను స్వీకరించారు. మండల పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరచడమే తన ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు. విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధి, ఉపాధ్యాయుల మధ్య సమన్వయం, ప్రభుత్వ పథకాలను సమర్థంగా అమలు చేయడంపై ప్రత్యేక దృష్టి సారిస్తానని రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు.
విద్యా రంగ అభివృద్ధికి సంబంధించి అధికారులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సహకారం అత్యంత అవసరమని రాజగోపాల్ రెడ్డి అన్నారు. కొత్త ఎంఈఓ బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లు, అనాజీపూర్ ప్రధానోపాధ్యాయులు నిర్మల, వడ్డేపల్లి ప్రధానోపాధ్యాయులు గోవర్ధన్, రామసాగర్ ప్రధానోపాధ్యాయులు రాజ్ కుమార్, ఉపాధ్యాయ బృందం, సీఆర్పీలు స్వామి, యాదగిరి, ఎల్లం తదితరులు పాల్గొన్నారు.
ఎంఈవోను సన్మానించిన ఉపాధ్యాయ సిబ్బంది