Maharaja | ఓటీటీలోకి విజయ్ సేతుపతి మహారాజ.. ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందంటే..?
Maharaja | కోలీవుడ్ స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi) కాంపౌండ్ నుంచి వచ్చిన చిత్రం మహారాజ (Maharaja). మక్కళ్ సెల్వన్ 50 (VJS50)గా వచ్చిన ఈ చిత్రానికి Kurangu Bommai ఫేం నితిలన్ సామినాథన్ దర్శకత్వం వహించాడు. జూన్ 14న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో ఎన్వీఆర్ సినిమా విడుదల చేసింది.
Maharaja | ఓ వైపు హీరోగా.. మరోవైపు నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలతో మూవీ లవర్స్‌లో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు కోలీవుడ్ స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi). ఈ స్టార్ హీరో కాంపౌండ్ నుంచి వచ్చిన చిత్రం మహారాజ (Maharaja). మక్కళ్ సెల్వన్ 50 (VJS50)గా వచ్చిన ఈ చిత్రానికి Kurangu Bommai ఫేం నితిలన్ సామినాథన్ దర్శకత్వం వహించాడు. జూన్ 14న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో ఎన్వీఆర్ సినిమా విడుదల చేసింది.
తమిళంలో సూపర్ హిట్ టాక్ తెచ్చుకోగా.. తెలుగులో మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఇక ఓటీటీ లవర్స్‌కు వినోదాన్ని అందించేందుకు రెడీ అయ్యాడు మహారాజ. ముందుగా అందించిన అప్డేట్ ప్రకారం 28 రోజుల థియాట్రికల్ రన్ తర్వాత పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌లోకి డిజిటల్ డెబ్యూ ఇచ్చింది మహారాజ. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఎక్కువ మంది ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తో స్ట్రీమింగ్ అవుతుంది మహారాజ.
కేకే నగర్లో సెలూనే షాప్ నిర్వహించే వ్యక్తిగా కనిపించే విజయ్‌సేతుపతి.. తన ఇంట్లో ఉన్న లక్ష్మిని దొంగిలించారంటూ పోలీసులకు ఫిర్యాదు చేస్తూ.. ఎఫ్ఐఆర్ ఫైల్ చేద్దామని వచ్చానని పోలీసులతో అంటాడు. లక్ష్మి అంటే నగలా, డబ్బా, డాక్యుమెంట్స్ అంటే అవేవి కాదంటున్నాడు. నీ కూతురు కాదు.. భార్య కాదు.. అక్కాచెల్లెలు కాదంటున్నారు. ఇంతకీ లక్ష్మి అంటే ఎవరయ్యా అంటూ సస్పెన్స్‌లో పెడుతూ సాగే సినిమా మరి ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ రాబట్టుకుంటుందనేది చూడాలి. ప్యాషన్ స్టూడియోస్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ చిత్రంలో బాలీవుడ్ దర్శకనిర్మాత అనురాగ్ కశ్యప్, మమతా మోహన్ దాస్, నట్టీ కీలక పాత్రల్లో నటించారు. కాంతార ఫేం అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించారు.
#Maharaja is now streaming on @Netflixindia ♥️#MegaBlockBusterMaharaja pic.twitter.com/3g0zHx63m2
— RamKumarr (@ramk8060) July 12, 2024
Read Also :
Bharateeyudu 2 Review | కమల్ హాసన్ సేమ్ మ్యాజిక్ రిపీట్ చేశాడా..? శంకర్ భారతీయుడు 2 ఎలా ఉందంటే..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

