Earthquake | ఈశాన్య రాష్ట్రం మేఘాలయ (Meghalaya)లో భూకంపం (Earthquake) సంభవించింది. సోమవారం తెల్లవారుజామున 2:23 గంటల ప్రాంతంలో భూమి ఒక్కసారిగా స్వల్ప స్థాయిలో కంపించింది. రిక్టరు స్కేలు (Richter Scale)పై భూకంపం తీవ్రత 3.3గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (National Center for Seismology) వెల్లడించింది. మేఘాలయలోని వెస్ట్ ఖాసీ హిల్స్ ప్రాంతంలో భూమికి 5 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లు పేర్కొంది. స్వల్ప స్థాయిలోనే ప్రకంపనలు నమోదవడంతో ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదు. మరోవైపు ఈ ప్రకంపనలతో గాఢ నిద్రలోని ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు.
An earthquake of magnitude 3.3 on the Richter Scale occurred today at 02:23:04 IST in West Khasi Hills, Meghalaya: National Center for Seismology pic.twitter.com/1CHkrEOmVL
— ANI (@ANI) June 9, 2024
Also Read..
Cabinet Meeting | పీఎం ఆవాస్ యోజన సాయం 50 శాతం పెంపు.. అదనంగా 2 కోట్ల గృహాలు..?
Sonakshi Sinha | పెళ్లి పీటలెక్కబోతున్న హీరామండి నటి..!
PM Modi | మోదీ తొలి విదేశీ పర్యటన ఖరారు.. 14న ఇటలీకి ప్రధాని!