Cabinet Meeting | కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ మరోసారి అధికారం చేపట్టింది. ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ (PM Modi) వరుసగా మూడోసారి ప్రమాణస్వీకారం చేశారు. మోదీ సహా 72 మందితో కేంద్ర కేబినెట్ కూడా ఏర్పాటైంది. వీరంతా ఆదివారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో మోదీ 3.0 కేబినెట్ ఇవాళ తొలిసారి సమావేశం కానుంది. సాయంత్రం 5 గంటలకు ఢిల్లీలోని లోక్‌కల్యాణ్ మార్గ్‌లోని ప్రధాని నివాసంలో కేబినెట్ మంత్రులు సమావేశం కాబోతున్నారు.
ఈ సమావేశంలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ (Pradhan Mantri Awaas Yojana-Gramin) కింద 2 కోట్ల అదనపు గృహాలను ఆమోదించే (approve more rural houses) అవకాశం ఉన్నట్లు తెలిసింది. అంతేకాకుండా ఈ పథకం కింద లబ్ధిదారులకు అందించే సాయాన్ని దాదాపు 50 శాతం పెంచే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు సోమవారం వెల్లడించాయి.
ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆదివారం రాత్రి న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రమాణస్వీకారం చేశారు. మోదీ సహా 72 మందితో కేంద్ర క్యాబినెట్ కూడా ఏర్పాటైంది. ప్రధాని, మంత్రులతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారం చేయించారు. 30 మందికి క్యాబినెట్ మంత్రులుగా అవకాశం లభించింది. మరో ఐదుగురిని స్వతంత్ర హోదాతో సహాయ మంత్రులుగా, 36 మందిని సహాయ మంత్రులుగా మంత్రివర్గంలోకి తీసుకున్నారు.
Also Read..
Jurala Project | ఎగువన వర్షాలు.. జూరాలకు స్వల్పంగా వరద
Pakistan Fan | ట్రాక్టర్ అమ్మి మరీ టికెట్ కొన్నాడు.. అయినా అతనికి మిగిలింది నిరుత్సాహమే
GHMC | కంటి తుడుపుగా పచ్చదనం.. గ్రేటర్లో గ్రీనరీ పెంపుపై కాంగ్రెస్ సర్కారు శీతకన్ను