Pakistan Fan | ట్రాక్టర్ అమ్మి మరీ టికెట్ కొన్నాడు.. అయినా అతనికి మిగిలింది నిరుత్సాహమే
ఐసీసీ టోర్నీల్లో వేదిక ఏదైనా పాక్‌పై (Pakistan) తమదే పైచేయి అని టీమ్ఇండియా (Team Indai) మరోసారి నిరూపించింది. టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా న్యూయార్క్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో దాయాది జట్టుపై భారత్ ఘన విజయం సాధించింది.
న్యూయార్క్: ఐసీసీ టోర్నీల్లో వేదిక ఏదైనా పాక్‌పై (Pakistan) తమదే పైచేయి అని టీమ్ఇండియా (Team Indai) మరోసారి నిరూపించింది. టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా న్యూయార్క్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో దాయాది జట్టుపై భారత్ ఘన విజయం సాధించింది. ఆధ్యంతం ఉత్కంఠభరితంగా సాగిన పొట్టి పోరులో తక్కువ స్కోరుకే పరిమితమైనప్పటికీ పాక్‌పై గెలిచిన రోహిత్ సేన మువ్వెన్నెల పతాకాన్ని సగర్వంగా రెపరెపలాడించింది. అయితే దాయాదుల మధ్య సమరం అంటే అభిమానుల్లో ఆసక్తి అంతాఇంతా కాదు. తమ జట్టే గెలవాలని ఇరుదేశాల అభిమానులు కోరుకుంటారు. ప్రత్యక్షంగా మ్యాచ్‌ను చూసి ఆస్వాధించాలని భావిస్తారు. అచ్చం ఇలాగే పాకిస్థాన్ ఫ్యాన్ (Pakistan Fan) ఒకరు తనకు జీవనాధారమైన ట్రాక్టర్‌ను అమ్ముకుని వచ్చిన ఆ డబ్బుతో భారత్-పాక్ మ్యాచ్ టికెట్ కొన్నాడు. అయితే చివరికి అతనికి నిరాశే మిగిలింది.
మ్యాచ్ ఫలితం చూసిన తర్వాత తాను నిరుత్సాహానికి గురయ్యానని పాక్ అభిమాని చెప్పాడు. 3 వేల డాలర్లు పెట్టి మ్యాచ్ టికెట్ కొనడానికి తన ట్రాక్టర్‌ను విక్రయించానని చెప్పాడు. భారత్ స్కోరు చూసినప్పుడు ఈ మ్యాచ్‌లో ఓడిపోతామని అనుకోలేదు. అది ఛేదించదగిన లక్ష్యమనే భావించాం. గేమ్ మొత్తం మాచేతుల్లోనే ఉంది. అయితే బాబర్ ఆజం ఔట్ అయిన తర్వాత పాక్ అభిమానులు నిరుత్సాహపడ్డారని చెప్పాడు. చివరి వరకూ పోరాడి మ్యాచ్‌ను నిలబెట్టుకున్న భారత జట్టును అభినందించాడు.
టీ20లలో బ్యాటర్ల రొడ్డకొట్టుడు బాదుడు కంటే ‘లో స్కోరింగ్ థ్రిల్లర్’లో ఉండే మజాను భారత్-పాక్ మ్యాచ్ మరోసారి అందించింది. చివరి బంతి దాకా ఇరు జట్ల మధ్య నువ్వా నేనా అంటూ దోబూచులాడిన విజయం ఆఖరికి భారత్‌ను వరించింది. ఆదివారం న్యూయార్క్ లోని నసావు స్టేడియం వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ సేన 6 వికెట్ల తేడాతో అత్యద్భుత విజయం అందుకుంది. పాక్ చతుర్దయం నసీమ్ షా (3/21), హరీస్ రవూఫ్ (3/21), మహ్మద్ అమిర్ (2/23), షహీన్ అఫ్రిది (1/29) నిప్పులు చెరగడంతో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్.. 19 ఓవర్లలో 119 పరుగులకే ఆలౌట్ అయింది. రిషభ్ పంత్ (31 బంతుల్లో 42, 6 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా అక్షర్ పటేల్ (20) గుడ్డిలో మెల్లలా ఫర్వాలేదనిపించాడు. భారత బ్యాటర్లలో కోహ్లీతో సహా ఏకంగా ఎనిమిది మంది ‘సింగిల్ డిజిట్’కే పరిమితమయ్యారు. బ్యాటర్లు విఫలమైనా బౌలర్లు సమిష్టిగా రాణించడంతో పాకిస్థాన్.. నిర్ణీత 20 ఓవర్లలో 113/7కే పరిమితమైంది. రిజ్వాన్ (44 బంతుల్లో 31, 1 ఫోర్, 1 సిక్సర్) రాణించినా మిగిలిన బ్యాటర్లు ఒత్తిడికి చిత్తయ్యారు. భారత విజయంలో కీలక పాత్ర పోషించిన బుమ్రా (3/14)కే ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Trishula Snanarchana | వేయిస్తంభాల ప్రాచీనకోనేరులో త్రిశూలస్నానార్చన
Theft Attempt | దొంగతనం చేసేందుకు సీసీ కెమెరాను బ్లర్ చేశారు.. కానీ ఏమైందో చూడండి.. వీడియో
AP News | ఏపీలో పలుచోట్ల టీడీపీ, వైసీపీ వర్గీయుల బాహాబాహీ..!
‘ప్రత్యామ్నాయ పంటలతో రైతులకు అధిక ఆదాయం’
Pushkar Singh Dhami | ఉత్తరాఖండ్‌లో మద్రాసాలలో శుక్రవారం సెలవు రద్దు.. ఇకపై ఆదివారమే సెలవు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!

