Sonakshi Sinha | బాలీవుడ్ స్టార్, హీరామండి (Heeramandi) నటి సోనాక్షి సిన్హా (Sonakshi Sinha) త్వరలో పెళ్లి పీటలెక్కబోతోంది. నటుడు జహీర్ ఇక్బాల్ (Zaheer Iqbal)ను సోనాక్షి పెళ్లాడనున్నట్లు తెలుస్తోంది. ఈనెల 23న ముంబైలో ఈ జంట వివాహం చేసుకోబోతున్నట్లు బాలీవుడ్ మీడియా వెల్లడించింది. గత కొన్ని రోజులుగా ప్రేమలో ఉన్న ఈ జంట కుటుంబ సభ్యుల అంగీకారంతో వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నట్లు పేర్కొంది. ఇక వీరి వివాహ ఆహ్వాన పత్రిక మ్యాగజైన్ కవర్ పేజ్ థీమ్‌తో రూపొందించినట్లుగా తెలిసింది. దానిపై ‘ది రూమర్స్ ఆర్ ట్రూ.. (పుకార్లు నిజమే)’ అనే క్యాప్షన్‌తో ఈ వెడ్డింగ్ ఇన్విటేషన్‌ను అతిథులకు అందించినట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
కాగా, సోనాక్షి – ఇక్బాల్ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. కానీ ఈ విషయాన్ని వారు ఎక్కడా బహిరంగంగా బయటపెట్టలేదు. అయితే, ఇద్దరి సోషల్ మీడియా పోస్టులు చూస్తే వీరి ప్రేమ బంధం నిజమని అర్థమవుతుంది. ఇక ఈ నెల ఆరంభంలో సోనాక్షి పుట్టినరోజు సందర్భంగా జహీర్ కొన్ని అందమైన ఫొటోలను పంచుకున్నారు. ఆ ఫొటోలకు ‘హ్యాపీ బర్త్‌డే సోన్జ్’ అంటూ క్యాప్షన్ పెట్టారు. ఇక వీరి పెళ్లికి స్నేహితులు, కుటుంబ సభ్యులతోపాటు హీరామండి చిత్ర బృందం కూడా హాజరుకానున్నట్లు సమాచారం.
నటుడు శత్రుఘ్న సిన్హా నటవారసురాలిగా సల్మాన్ నటించిన దబంగ్ సినిమాతో సోనాక్షి హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయమైంది. తొలి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇక చివరిసారిగా సంజయ్ లీలా బన్సాలీ రూపొందించిన ‘హీరామండి’ వెబ్ సిరీస్‌లో సోనాక్షి మెరిసింది. ఈ చిత్రంలో సోనాక్షితోపాటు మనీషా కోయిరాలా, రిచా చద్ధా, సంజీదా షేక్, షర్మిన్ సెగల్, అతిది రావు హైదరి నటించారు. స్వాతంత్య్రానికి ముందు పాకిస్థాన్‌లోని లాహోర్‌లో ఉన్న వేశ్యావాటిక హీరామండిలో జరిగిన పలు సంఘటనల ఆధారంగా ఈ సిరీస్‌ను రూపొందించారు. ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది.
Also Read..
Cabinet Meeting | పీఎం ఆవాస్ యోజన సాయం 50 శాతం పెంపు.. అదనంగా 2 కోట్ల గృహాలు..?
Boyapati Sreenu | బాలయ్య బాబుకు జన్మదిన శుభాకాంక్షలు.. బోయపాటి టీం BB4 అనౌన్స్మెంట్ లుక్ వైరల్
PM Modi | మోదీ తొలి విదేశీ పర్యటన ఖరారు.. 14న ఇటలీకి ప్రధాని!