Boyapati Sreenu | టాలీవుడ్లో మోస్ట్ బ్లాక్ బస్టర్ క్రేజీ కాంబినేషన్ ఏదైనా ఉందా..? అంటే ఠక్కున చెప్పేది బాలకృష్ణ (Nandamuri Balakrishna)-బోయపాటి శ్రీను (Boyapati Sreenu). ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన సింహా, లెజెండ్, అఖండ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోశాయని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. బాలయ్య-బోయపాటి నుంచి సినిమా వస్తుందంటే రికార్డులు, వసూళ్ల గురించే అంతటా చర్చ నడుస్తుంది. తాజాగా బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు BB4 (BB4) రెడీ అవుతోంది.
14 రీల్స్ ప్లస్ బ్యానర్లో రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మన బాలయ్య బాబుకు జన్మదిన శుభాకాంక్షలు బోయపాటి-బాలయ్య బీబీ4 కోసం మళ్లీ కలుస్తున్నారు.. అంటూ సినిమా అనౌన్స్మెంట్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ లుక్ నెట్టింట వైరల్ అవుతోంది. డెడ్లీ కాంబినేషన్లో బెంచ్మార్క్ సినిమాగా రాబోతున్న ఈ సినిమాకు టాప్ టెక్నీషియన్లు పనిచేయబోతుండగా.. త్వరలోనే పూర్తి వివరాలపై క్లారిటీ ఇవ్వనున్నారు మేకర్స్.
The Lethal Combo that sets the screens on fire is Back 🔥🔥
The two Forces – ‘GOD OF MASSES’ #NandamuriBalakrishna & #BoyapatiSreenu reunite for #BB4 🌋🌋
Happy Birthday Balayya Babu ❤️🔥
Produced by @RaamAchanta #GopiAchanta under @14ReelsPlus banner ❤️
Presented by… pic.twitter.com/Oj9b1j9bvS
— 14 Reels Plus (@14ReelsPlus) June 10, 2024