Allu Arjun | మొన్న విజయ్, నిన్న అల్లు అర్జున్.. ఫ్యాన్స్ మధ్య నలిగిపోతున్న స్టార్స్
Allu Arjun | హైదరాబాద్‌లో మరోసారి స్టార్ క్రేజ్ ఎలా ఉంటుందో చూపించే ఘటన చోటుచేసుకుంది.ఈ మధ్య సెలబ్రిటీలు అభిమానుల తాకిడితో ఎక్కువగా ఇబ్బంది పడుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. ఆ మధ్య నిధి అగర్వాల్, సమంత, విజయ్ వంటి స్టార్స్ చాలా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు ఈ జాబితాలో ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పేరు కూడా చేరింది.
Allu Arjun | హైదరాబాద్‌లో మరోసారి స్టార్ క్రేజ్ ఎలా ఉంటుందో చూపించే ఘటన చోటుచేసుకుంది.ఈ మధ్య సెలబ్రిటీలు అభిమానుల తాకిడితో ఎక్కువగా ఇబ్బంది పడుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. ఆ మధ్య నిధి అగర్వాల్, సమంత, విజయ్ వంటి స్టార్స్ చాలా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు ఈ జాబితాలో ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పేరు కూడా చేరింది. వ్యక్తిగతంగా బయటకు వచ్చిన సందర్భాల్లోనూ స్టార్లకు ప్రైవసీ లేకుండా పోతోందన్న చర్చకు ఈ ఘటన మరింత బలం చేకూర్చింది. శనివారం రాత్రి నగరంలోని ఓ సినీ కార్యక్రమానికి హాజరైన అల్లు అర్జున్, అనంతరం భార్య స్నేహారెడ్డితో కలిసి హైటెక్ సిటీ పరిసరాల్లోని నిలోఫర్ కేఫ్‌కు వెళ్లారు.
ప్రశాంతంగా గడపాలన్న ఉద్దేశంతో వెళ్లిన ఈ జంటకు అక్కడ ఊహించని పరిస్థితి ఎదురైంది. బన్నీ అక్కడ ఉన్నాడన్న విషయం తెలిసిన క్షణాల్లోనే పెద్ద సంఖ్యలో అభిమానులు అక్కడికి చేరుకున్నారు. సెల్ఫీలు, వీడియోల కోసం అభిమానులు ఒక్కసారిగా గుమిగూడటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అల్లు అర్జున్ తన భార్య భద్రతపై అప్రమత్తంగా ఉంటూ ఆమె చేయి పట్టుకుని ముందుకు తీసుకెళ్లడం అక్కడున్నవారికి కనిపించింది. అభిమానుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో సెక్యూరిటీ సిబ్బందికీ పరిస్థితిని అదుపులోకి తీసుకురావడం కష్టంగా మారింది. చివరకు భారీ భద్రత మధ్య బన్నీ దంపతులు కారులోకి చేరారు. వెళ్లే ముందు అభిమానులను శాంతంగా ఉండాలని కోరుతూ, కారు కిటికీ నుంచి అభివాదం చేశారు.
ఈ మొత్తం ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, నెటిజన్లు మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నారు. కొందరు అభిమానుల ప్రేమను ప్రశంసిస్తుండగా, మరికొందరు మాత్రం సెలబ్రిటీల వ్యక్తిగత జీవితానికి కూడా గౌరవం ఇవ్వాలంటూ సూచనలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా, అదే రోజున హైదరాబాద్‌లో అల్లు అర్జున్ తన ప్రతిష్టాత్మక థియేటర్ ‘అల్లు సినిమాస్’కు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. టెక్నికల్ చెక్ ఈవెంట్లో తన కుమారుడు అయాన్‌తో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చిన బన్నీ మరోసారి అభిమానులను ఆకట్టుకున్నారు. థియేటర్లో అల్లు రామలింగయ్య, అల్లు అరవింద్, చిరంజీవి చిత్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవడం విశేషం.
Icon Star #AlluArjun was spotted with his wife at Cafe Niloufer, Hitech City, last night
#AlluSnehaReddy pic.twitter.com/HCuMbiZwOF
— YK Tv Entertainment (@YKTvEnt) January 4, 2026
Happy to be a part of tech check of @AlluCinemas
It’s gonna be the Next ICONIC spot in Hyderabad
Incredible picture quality and sound is top notch.
Super happy to Know that this is ASIA’s No 1 and Worlds 2nd biggest @DolbyCinemaWatched @rajasaabmovie @PushpaMovie… pic.twitter.com/CpEfeMkbNB
— SKN (Sreenivasa Kumar) (@SKNonline) January 3, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

