Air India | దేశీయ ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా (Air India)లో సాంకేతిక సమస్యలు (technical snag) కొనసాగుతున్నాయి. జాతీయ, అంతర్జాతీయంగా నడిచే ఏదో ఒక విమానంలో నిత్యం టెక్నికల్ సమస్యలు తలెత్తుతున్నాయి. తాజాగా ముంబై నుంచి లండన్ వెళ్లాల్సిన ఫ్లైట్ (Mumbai to London flight) ఆలస్యమైంది.
శనివారం ఉదయం విమానం ముంబై నుంచి లండన్ బయల్దేరాల్సి ఉంది. అయితే, సాంకేతిక సమస్య కారణంగా విమానం దాదాపు ఆరు గంటలు ఆలస్యమైనట్లు సంస్థ ప్రకటించింది. ‘ఇవాళ ఉదయం 6:30 గంటలకు ఎయిర్ ఇండియాకు చెందిన AI129 విమానం ముంబై నుంచి లండన్‌కు బయల్దేరాల్సి ఉంది. అయితే, సాంకేతిక సమస్య కారణంగా.. విమానం ఆలస్యమైంది. మధ్యాహ్నం 1 గంటలకు విమానం బయల్దేరుతుంది. ప్రయాణికులకు కలిగిన ఈ అసౌకర్యానికి చింతిస్తున్నాము’ అని ఎయిర్ ఇండియా ఓ ప్రకటనలతో తెలిపింది.
Mumbai | Air India flight AI129, scheduled to take off from Mumbai for London at 6.30 am, is delayed and yet to take off. Due to technical difficulties, the flight will now take off at 1 pm. Passengers have been provided with refreshments: Air India pic.twitter.com/5wfUx5BwkV
— ANI (@ANI) November 8, 2025
Also Read..
Air Pollution | ఢిల్లీలో అధ్వానస్థితిలో వాయు కాలుష్యం.. శ్వాస తీసుకోవడంలో ప్రజల ఇబ్బందులు
Mali | మాలిలో ఐదుగురు భారతీయులు కిడ్నాప్
Delhi Airport | 36 గంటల తర్వాత.. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో సాధారణ స్థితికి విమాన కార్యకలాపాలు