Air Pollution | దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం (Air Pollution) కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా ఢిల్లీ-ఎన్సీఆర్లో గాలి నాణ్యత అధ్వాన స్థాయిలో నమోదవుతోన్న విషయం తెలిసిందే. తాజాగా శనివారం ఉదయం కూడా ఢిల్లీలో కాలుష్యం (Delhi Pollution) వెరీ పూర్ (Very Poor) కేటరిగీలో నమోదైంది.
సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్రకారం.. శనివారం ఉదయం ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 355గా నమోదైంది. ఆనంద్ విహార్‌లో ఏక్యూఐ 332గా, అలీపూర్ వద్ద 316, అశోక్ విహార్‌లో 332, ఇండిగా గేట్ వద్ద ఏక్యూ 322గా, పాలెం ప్రాంతంలో 320, ధౌలా కువాన్‌లో 269, అశోక్ విహార్ ప్రాంతంలో 332, బవానాలో 366, బురారి క్రాసింగ్ వద్ద 345, ఛాందిని చౌక్ ప్రాంతంలో 354, ద్వారకా సెక్టార్-8లో 310, ఐటీఓ ప్రాంతంలో 337, జహంగీర్‌పురిలో 342, ముండ్కా ప్రాంతంలో 335, నరేలా వద్ద 335, ఓఖ్లా ఫేజ్-2లో 307, పట్పర్గంజ్ వద్ద 314, పంజాబీ బాగ్ 343, ఆర్కే పురంలో 321, రోహిణి ప్రాంతంలో 336, సోనియా విహార్ వద్ద 326గా ఏక్యూఐ వెరీ పూర్ కేటగిరీలో నమోదైంది.
కాలుష్య స్థాయిలు తీవ్రస్థాయిలో ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శ్వాస తీసుకోవడం కష్టతరంగా ఉందని స్థానిక నివాసి కరణ్ శర్మ అనే వ్యక్తి తెలిపారు. ఈ పరిస్థితి పరిష్కరించేందుకు ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ‘ఢిల్లీలో కాలుష్యం చాలా ఎక్కువగా ఉంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. సంబంధిత విభాగాలు ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు. ప్రభుత్వం ఈ సమస్యపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి’ అని అతను కోరారు.
Also Read..
Mali | మాలిలో ఐదుగురు భారతీయులు కిడ్నాప్
Delhi Airport | 36 గంటల తర్వాత.. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో సాధారణ స్థితికి విమాన కార్యకలాపాలు
Ajit Pawar | అది ప్రభుత్వ భూమి అని నా కుమారుడికి తెలియదు.. భూ కుంభకోణంపై అజిత్ పవార్