హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): మిత్రులు, మిత్రపక్షం అంటూనే సీపీఐకి చెందిన కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కాంగ్రెస్‌కు చురకలంటించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని చెప్పారు. మంత్రి సీతక్క ఇచ్చే కాగితాల్లో తప్ప.. గ్రామాల్లో రోడ్లు లేవని అన్నారు. ఏ మంత్రులను అడిగినా డ బ్బులు లేవనే సమాధానం వస్తున్నదని చెప్పారు. ఇందిరమ్మ ఇండ్లలో అక్రమా లు అరికట్టాలంటే లాటరీ పద్ధతిని అమ లు చేయాలని సూచించారు. పేదల ఇండ్ల ను కూలగొట్టడంలో హైడ్రా దుందుడుకు గా వ్యవహరిస్తున్నదని, హైకోర్టు స్టే ఇచ్చి నా కూల్చివేతలు కొనసాగిస్తున్నదని ఆరోపించారు. ధరణి స్థానంలో తీసుకొచ్చిన భూ భారతిలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని చెప్పారు. సాదాబైనామా కు పాత పట్టాదారు సంతకా లు కావాలనే నిబంధనతో మళ్లీ వసూళ్ల రాజ్యం నడుస్తున్నదని ఎత్తిచూపారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వోద్యోగులకు ఎప్పుడూ ఐదు డీఏలు పెం డింగ్‌లో లేవని.. ఇప్పుడు ఆ పరిస్థితి నెలకొన్నదని, ప్రభుత్వం తక్షణం వాటిని విడుదల చేసే ఏర్పాటు చేయాలని చెప్పా రు. సింగరేణిలో 16వేల డిపెండెంట్ ఉద్యోగాలు బీఆర్ఎస్ ఇచ్చిందని, ఇప్పు డు వాటిని ఇవ్వబోమని కాంగ్రెస్ ప్రభు త్వం అంటున్నదని, సింగరేణి కార్మికుల తో పెట్టుకుంటే ప్రభుత్వాలు కూలిపోతాయని హెచ్చరించారు. ఆర్టీసీ విలీన ప్రక్రియను ప్రభుత్వం ఎందుకు చేపట్టడంలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. తక్షణం ఆర్టీసీలో ట్రేడ్ యూనియన్లను పునరుద్ధరించి.. ఎన్నికలు నిర్వహించాలన్నారు. ప్రభుత్వ నిర్వాకం వల్లనే ఆర్టీసీలో కార్మికులు, జెన్కోలో ఆర్టిజన్లు సమ్మెకు వెళ్తున్నారని చెప్పారు. తమ మిత్రపక్షమైన కాంగ్రెస్ బాగుండాలనే ఉద్దేశంతోనే ఇన్ని సూచనలు చేసినట్టు చెప్పారు.