Air India | గుజరాత్లో ఘోర ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్ నుంచి లండన్ బయల్దేరిన (London bound flight) ఎయిర్ ఇండియా (Air India) విమానం టేకాఫ్ అయిన నిమిషాల్లోనే కుప్పకూలిపోయింది. ఈ ఘటనపై యావత్తు దేశం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియా సంస్థ తన సోషల్ మీడియా ఖాతాల్లోని ప్రొఫైల్ పిక్స్‌ను బ్లాక్ (profile pics go black) ఐకాన్లోకి మార్చేసింది. ట్విట్టర్, ఇన్‌స్టా ఖాతాలోని ప్రొఫైల్ పిక్స్, ఎక్స్ కవర్ ఫొటోను మొత్తం బ్లాక్ ఐకాన్లోకి మార్చేసింది.
ఎయిర్ ఇండియా విమానం గురువారం మధ్యాహ్నం 1.39 గంటలకు ఇద్దరు పైలట్లు, 10 మంది క్యాబిన్ సిబ్బందితో పాటు 242 మంది ప్రయాణికులతో లండన్ బయల్దేరింది. మొత్తం 242 మందిలో 169 మంది భారతీయులుగా అధికారులు తెలిపారు. మరో 53 మంది బ్రిటన్ దేశస్థులు, ఏడుగురు పోర్చుగల్ పౌరులు, ఒకరు కెనడా జాతీయుడు ఉన్నారు. విమానం టేకాఫ్ అయిన నిమిషాల వ్యవధిలోనే ఎయిర్‌పోర్టుకు సమీపంలోని సివిల్ ఆస్పత్రి వద్ద బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ (medical college hostel) భవనంపై కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 133 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. మరోవైపు ప్రమాదంలో హాస్టల్ భవనాలు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. అందులోని 20 మంది మెడికోలు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.
Also Read..
Ahmedabad Plane Crash | అహ్మదాబాద్‌లో కూలిన ఎయిర్ ఇండియా విమానం.. 133 మంది మృతి..?
Ahmedabad Plane Crash | హాస్పిటల్ హాస్టల్ బిల్డింగ్‌పై కూలిన విమానం.. 20 మంది మెడికోలు మృతి..!