Technical Snag | ప్రముఖ దేశీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా (Air India)లో సాంకేతిక సమస్యలు (Technical Snag) కొనసాగుతున్నాయి. తాజాగా ముంబై నుంచి నెవార్క్ (Newark) బయల్దేరిన విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమానం కొన్ని గంటలపాటూ గాల్లోనే చక్కర్లు కొట్టి.. చివరికి ముంబై ఎయిర్పోర్ట్లో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది.
ఎయిర్ ఇండియాకు చెందిన AI191 విమానం మంగళవారం అర్ధరాత్రి 1.15 గంటలకు ముంబై ఎయిర్ పోర్టు నుంచి అమెరికా న్యూజెర్సీలోని నెవార్క్ నగరానికి బయల్దేరింది. అయితే, విమానం టేకాఫ్ అయిన కాసేపటికే టెక్నికల్ ఎర్రర్ వచ్చింది. విమానంలో సాంకేతిక సమస్య తలెత్తినట్లు పైలట్ గుర్తించారు. ఈ విషయాన్ని ముంబై ఏటీసీకి తెలియజేశారు. ఎయిర్ పోర్ట్ అధికారుల సూచన మేరకు విమానాన్ని తిరిగి ముంబైకి మళ్లించారు. బుధవారం తెల్లవారుజామున 5.30 గంటలకు ముంబై ఎయిర్పోర్టులో విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. విమానం సేఫ్గా ల్యాండ్ కావడంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటనతో నెవార్క్ నుంచి ముంబైకి రావాల్సిన AI191, AI144 విమానాలను రద్దు చేసినట్లు ఎయిర్ ఇండియా ప్రతినిధి తెలిపారు.
Also Read..
Droupadi Murmu | ఇరుముడితో శబరిమలకు ద్రౌపది ముర్ము.. అయ్యప్పని దర్శించుకున్న తొలి రాష్ట్రపతి
IMD | కుండపోత వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
Air Pollution | ఢిల్లీని కమ్మేసిన దట్టమైన పొగ.. క్షీణించిన గాలి నాణ్యత